చెరకు తోటలో 18 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ మరో అమ్మాయి హత్య.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-28T21:55:25+05:30 IST

ఆ రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా అక్కడ ఓ 18 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించింది.

చెరకు తోటలో 18 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ మరో అమ్మాయి హత్య.. అసలేం జరిగిందంటే..

ఆ రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా అక్కడ ఓ 18 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించింది.. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరీశీలించగా.. శరీరంపై గాయాలు కనిపించాయి.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి తండ్రిని విచారించగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌‌ను తన కుమారుడు నడుపుతున్నాడని, రాత్రి అక్కడకు వెళ్లిన అతడు తిరిగి రాలేదని చెప్పాడు. పోలీసులు ట్రాక్టర్ యజమాని ఇంటికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. 


ఇది కూడా చదవండి..

Shocking: బాత్రూంలో ఇరుక్కుపోయిన మహిళ.. ప్రాణభయంతో గోడలపై లిప్‌స్టిక్‌తో చివరి మెసేజ్.. మూడు రోజుల తర్వాత..


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్‌ జిల్లా బస్తీలో పరువు హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ జంట ఏకాంతంగా ఉండడాన్ని చూసిన యువతి కుటుంబీకులు వారిద్దరినీ హత్య చేశారు. యువతి మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చేశారు. యువకుడి మృతదేహాన్ని గ్రామ శివార్లలో ఉన్న పొలంలో పడేశారు. తర్వాతి రోజు ఉదయం తన పొలంలో ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసి రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యువకుడి తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు బాలిక కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. వారు నిజం అంగీకరించారు. 


యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు, యువతి మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని బాలిక కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ పరువు హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. 

Read more