Allu Aravind counter: అది జరిగే పని కాదు

ABN , First Publish Date - 2022-11-19T19:22:03+05:30 IST

‘‘సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ, స్ట్రెయిట్‌ చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని ఇటీవల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎగ్జిబిటర్‌లకు ఓ లేఖ రాసిని సంగతి తెలిసిందే! అయితే ఈ ప్రతిపాదన గతంలో దిల్‌ రాజు తీసుకొచ్చారు.

Allu Aravind counter: అది జరిగే పని కాదు

‘‘సంక్రాంతికి (Sankranti season) కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ, స్ట్రెయిట్‌ (Straight movies)చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని ఇటీవల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎగ్జిబిటర్‌లకు ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే! అయితే ఈ ప్రతిపాదన గతంలో దిల్‌ రాజు (Dil raju)తీసుకొచ్చారు. దసరా, సంక్రాంతి సినిమాల విడుదలకు పెద్ద సీజన్‌. పైగా సినిమావాళ్లకు ఆ పండుగలంటే సెంటిమెంట్‌ కూడా. భారీ చిత్రాలన్నీ ఈ సీజన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. అలాగే డబ్బింగ్‌ చిత్రాలకు కూడా ఇదే అనువైన సమయం. కానీ ఇప్పుడు పండుగల సీజన్‌లో తెలుగు చిత్రాలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం... ఆ తర్వాతే అనువాద చిత్రాల గురించి ఆలోచించాలి అన్న కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన నిర్మాత దిల్‌ రాజు 2019లోనే తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన ఎంతవరకూ వర్కవుట్‌ అవుతుందనే విషయాన్ని గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind counter)ముందు ఉంచగా ‘అది జరిగే పని కాదు’ అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నెల 25న ఆయన విడుదల చేయనున్న ‘తోడేలు’ చిత్రంతో ఈ ఏడాది గీతా సంస్థకు హ్యాట్రిక్‌ విజయం రానుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కాంతార’, ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత వరుసగా ఇది హ్యాట్రిక్‌ అనుకోవచ్చు. డిసెంబర్‌లో మరో రిలీజ్‌  ‘18 పేజెస్‌’ ఉంది. కాబట్టి ఈ ఏడాది నా ఖాతాలో నాలుగు విజయాలు వేసుకోవచ్చు’’ అని అన్నారు. 

Updated Date - 2022-11-19T19:44:49+05:30 IST