పెళ్లయిన 10 నెలల తర్వాత.. తన భర్త కూడా ఓ మహిళే అని ఆ భార్యకు తెలిస్తే.. నివ్వెరపోయేలా చేస్తున్న వింత కేసు..!

ABN , First Publish Date - 2022-06-23T02:28:18+05:30 IST

ఇండోనేసియాకు చెందిన ఓ మహిళ పెళ్లి జరిగిన 10 నెలల తర్వాత తన భర్త పురుషుడు కాదు.. మహిళ అని తెలుసుకుని షాకైంది.

పెళ్లయిన 10 నెలల తర్వాత.. తన భర్త కూడా ఓ మహిళే అని ఆ భార్యకు తెలిస్తే.. నివ్వెరపోయేలా చేస్తున్న వింత కేసు..!

ఇండోనేసియాకు చెందిన ఓ మహిళ పెళ్లి జరిగిన 10 నెలల తర్వాత తన భర్త పురుషుడు కాదు.. మహిళ అని తెలుసుకుని షాకైంది. అప్పుడు కూడా ఆమె స్వయంగా గుర్తించలేదు.. పోలీసు విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఈ వార్త ఇండోనేసియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒక డేటింగ్ యాప్ ద్వారా కొన్ని రోజుల క్రితం NA అనే పేరుగల యువతికి AA అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తను అమెరికాలో పేరు పొందిన సర్జన్, బొగ్గు వ్యాపారవేత్తనని AA చెప్పుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 


ఇది కూడా చదవండి..

నాకీ పెళ్లి వద్దంటూ పీటల పైనుంచే లేచి వెళ్లిపోయిన వరుడు.. అసలు కారణం తెలిసి నివ్వెరపోయిన బంధువులు..!


ఈ ఇద్దరికీ పది నెలల క్రితం రహస్య వివాహం జరిగింది. ఈ వివాహాన్ని మత పెద్దలు మాత్రమే ఆమోదిస్తారు. కానీ, చట్టబద్ధంగా గుర్తింపు ఉండదు. ఎందుకంటే AA తనకు సంబంధించిన పత్రాలను అధికారులకు సమర్పించలేకపోయాడు. పెళ్లి తర్వాత చాలా నెలల పాటు నూతన వధూవరులు NA తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండిపోయారు. AA తనకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సమర్పించలేకపోవడంతో NA  తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పైగా వారి నుంచి AA తరచుగా డబ్బు తీసుకుంటూ ఉన్నాడు. వారి అనుమానాన్ని నివృత్తి చేసేందుకు NAను సౌత్ సుమత్రాలోని లహత్‌కు AA తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బంధించి, ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమెను నదిలోకి తోసి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఎంతకీ తమ కూతురు ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చివరకు ఏప్రిల్‌లో  NAను పోలీసులు ట్రాక్ చేయగలిగారు. AAను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో AA ఒక మహిళ అని తేలింది. ఆమె ఒక మహిళా కాన్ ఆర్టిస్ట్ అని తెలిసింది. వివాహం తర్వాత తాము పలుసార్లు శృంగారంలో పాల్గొన్నామని, అయితే శృంగారానికి ముందు AA ఎప్పుడూ లైట్లు ఆఫ్ చేసి, తన కళ్లకు గంతలు కట్టేవాడని NA తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.  

Updated Date - 2022-06-23T02:28:18+05:30 IST