Viral Video: ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..
ABN , First Publish Date - 2022-07-04T00:51:59+05:30 IST
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్..

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సాధారణంగా మగవారు కొట్టుకోవడం చూశాం.. అలాగే ఆడవారు కొట్టుకోవడం కూడా చూశాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆడామగా తేడా లేకుండా.. అంతా కలిసి పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లోని ఓ క్రూయిజ్ షిప్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 60 నుంచి 70 ప్రేమ జంటలు, దంపతులు పార్టీలో పాల్గొన్నాయి. ఫుల్‌గా మందు కొట్టిన ప్రయాణికులు.. కొద్ది సేపు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఒక్కసారిగా గొడవ మొదలైంది. నువ్వు మోసం చేశావ్.. అంటే నువ్వు మోసం చేశావ్.. అంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆడామగా తేడా లేకుండా ఒకరిమీద ఒకరు పడుతూ.. దుస్తులు చించుకుంటూ రచ్చ రచ్చ చేశారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా.. అని కొందరు, మందు ఎక్కువై మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.