Viral Video: మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-07-03T01:05:06+05:30 IST

స్నేహానికి జాతి, కులం, మతం.. ఇవేవీ ఉండవంటారు పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది నమ్మిన స్నేహితులనే మోసం చేస్తుంటారు. ఇలాంటి వార్తలు రోజూ ఎక్కడో చోట తరచూ..

Viral Video: మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..

స్నేహానికి జాతి, కులం, మతం.. ఇవేవీ ఉండవంటారు పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది నమ్మిన స్నేహితులనే మోసం చేస్తుంటారు. ఇలాంటి వార్తలు రోజూ ఎక్కడో చోట తరచూ వింటూ ఉంటాం. ఈ క్రమంలో ఒక్కోసారి, స్నేహం అంటే ఇలా ఉండాలంటూ.. కొన్ని జంతువులు సందేశం ఇస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ కోతి పిల్ల, పిల్లి.. మేం బెస్ట్ ఫ్రెండ్స్.. మా మధ్య ఎలాంటి వైరాలూ లేవంటూ నిరూపిస్తున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ పిల్లి దేనికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కోతి పిల్ల.. అరే! నా స్నేహితుడు ఇక్కడేం చేస్తున్నాడు.. అన్నట్లుగా దాని వద్దకు వెళ్తుంది. మిత్రమా! ఎవరి కోసం ఎదురు చూస్తున్నావ్.. నీకు తోడుగా నేను ఉంటాగా.. అన్నట్లుగా పిల్లి మీద చేయి వేసి, కౌగిలించుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. జంతువులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..





Updated Date - 2022-07-03T01:05:06+05:30 IST