పక్కాప్లాన్‌తో ఇంట్లో నీళ్ల ట్యాప్‌లు ఓపెన్.. అంత్యక్రియలు చేయండంటూ రూ.20 వేలను ఎక్కడ పెట్టారో లేఖలో రాసి మరీ..
ABN , First Publish Date - 2022-05-28T22:05:28+05:30 IST
తమతో ఆత్మీయంగా కలిసి తిరిగిన వ్యక్తి అకస్మాత్తుగా దూరం కావడంతో వారు విషాదంలో మునిగిపోయారు..

తమతో ఆత్మీయంగా కలిసి తిరిగిన వ్యక్తి అకస్మాత్తుగా దూరం కావడంతో వారు విషాదంలో మునిగిపోయారు.. ఆ విచారం నుంచి బయటపడలేక తాము కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు.. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాశారు.. తమ అంత్యక్రియల కోసం అవసరమైన డబ్బును ఫొటో దగ్గర పెట్టినట్టు పేర్కొన్నారు.. ఇంట్లోని కొళాయిలన్నింటినీ ఓపెన్ చేసి పెట్టారు.. అలా చేస్తే చుట్టుపక్కల వాళ్లు గమనించి తమ ఇంటికి త్వరగా వస్తారనేది వాళ్ల ప్లాన్.. చివరకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఇది కూడా చదవండి..
మార్కెట్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. మర్నాడే ఓ బావిలో 5 మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..
కోల్‌కతాలోని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ షాప్ నిర్వహిస్తున్న స్నేహాశీస్ అనే వ్యక్తి గత నెల 26వ తేదీన గ్యాస్ట్రిక్ సమస్యతో చనిపోయారు. అప్పట్నుంచి అతని భార్య సుపర్ణ, కూతురు స్నేహ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆ విషాదం నుంచి బయటపడలేక తాము కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. చనిపోయే ముందు తమ చావులకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాశారు. అలాగే తమ అంత్యక్రియలకు అవసరమైన రూ.20 వేలు హాల్లో ఉన్న ఫోటో దగ్గర ఉంచినట్టు పేర్కొన్నారు. అనంతరం ఇంట్లోని ట్యాప్లన్నీ ఓపెన్ చేసి, ఉరేసుకుని చనిపోయారు.
వారి ఫ్లాట్ నుంచి నీరు ఎక్కువగా పోతుండడాన్ని వాచ్మెన్ గమనించాడు. తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో కింది ఫ్లాట్‌లో ఉంటున్న స్నేహాశీస్ సోదరుడికి సమాచారం ఇచ్చాడు. అతను ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల సుపర్ణ, స్నేహ ఉరేసుకుని ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.