పెంచిన పాశాన్ని కర్కశంగా తెంచింది... ప్రియుడితో కలిసి పిన్నిని దారుణంగా..

ABN , First Publish Date - 2022-09-02T01:04:15+05:30 IST

పిల్లలు లేకపోవడంతో అక్క కూతురును తెచ్చుకుని పెంచి పెద్ద చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటూ బాగా చదివిస్తోంది. పెద్దయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ..

పెంచిన పాశాన్ని కర్కశంగా తెంచింది... ప్రియుడితో కలిసి పిన్నిని దారుణంగా..

పిల్లలు లేకపోవడంతో అక్క కూతురును తెచ్చుకుని పెంచి పెద్ద చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటూ బాగా చదివిస్తోంది. పెద్దయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ మహిళ రోజూ కలలు కనేది. అయితే బాలిక మాత్రం ఆమె ఆశలను అడియాశలు చేసింది. చిన్న వయసులోనే ప్రేమలో పడడమే కాకుండా అతడితో కలిసి.. కుట్రకు తెరలేపింది. మూడుసార్లు విఫలయత్నం చేసి, చివరకు ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్‌లోని నసీరాబాద్ పరిధికి చెందిన బేలా జాన్సన్ (48)కు పిల్లలు లేరు. దీంతో అన  అక్క కూతురును తెచ్చుకుని, చిన్నప్పటి నుంచి పెద్ద చేసింది. బాగా చదివించి, పెద్దయ్యాక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని కలలు కనేది. అయితే బాలిక మాత్రం ఆమె కోరికలకు అనుగుణంగా నడుచుకునేది కాదు. చిన్న వయసులోనే స్థానిక ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. బేలాకు తెలీకుండా ప్రియుడిని రోజూ కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో యువకుడు బేలా ఆస్తిపై కన్నేశాడు. బాలికను వివాహం చేసుకుంటే ఆమె ఆస్తిని కూడా సొంతం చేసుకోవచ్చని పథకం వేశాడు. ఇదే విషయాన్ని బాలికతో చెప్పగా.. ఆమె కూడా ఇందుకు అంగీకరించింది. వారి పెళ్లికి బేలా ఒప్పుకోకపోవడంతో చివరకు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు.

లేవరా.. కళ్లు తెరువు అంటూ ఏడుస్తూ పిలుస్తుండగానే తల్లి ఒడిలోనే కన్నుమూసిన 5 ఏళ్ల బాలుడు.. ఆస్పత్రి ముందే దారుణం..!


ఈ క్రమంలో ప్రియుడి సలహా మేరకు కూరలో విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేసి విఫలమైంది. తర్వాత మరో రెండు సార్లు విఫలయత్నం చేసింది. చివరకు ఆదివారం ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 10గంటల సమయంలో గౌతమ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బేలా జాన్సన్ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అంతా కలిసి ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేసి పారిపోయారు. బేలా బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. చివరకు బావిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు 24గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

దైవ దర్శనం కోసం రాష్ట్రం దాటి వచ్చిన కుటుంబం.. హోటల్ గది నుంచి ఉదయాన్నే బయటికి వెళ్లిన బాలిక.. ఐదు రోజుల తర్వాత..Read more