ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..

ABN , First Publish Date - 2022-06-23T00:45:59+05:30 IST

ఆమెకు పిల్లులంటే ఎంతో ఇష్టం. దీంతో సుమారు 20పిల్లలను ఇంట్లో ఉంచుకుని సొంత పిల్లల్లా పెంచుతోంది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ ఉన్నట్టుండి ఆమె మరణించింది. దీంతో...

ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..

ఆమెకు పిల్లులంటే ఎంతో ఇష్టం. దీంతో సుమారు 20పిల్లలను ఇంట్లో ఉంచుకుని సొంత పిల్లల్లా పెంచుతోంది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ ఉన్నట్టుండి ఆమె మరణించింది. దీంతో పిల్లులకు ఆహారం అందించేవారు లేకుండా పోయారు. ఇంట్లోనే ఉండడంతో అవి ఆకలితో అలమటించాయి. లోపల తినడానికి ఏమీ లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత.. చివరకు తమ యజమాని మృతదేహాన్నే తినేశాయి. వివరాల్లోకి వెళితే..


రష్యాలోని బటేస్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మహిళ.. మైనే కూన్ అనే జాతికి చెందిన 20 పిల్లులను పెంచుతోంది. ఈ పిల్లలు మిగతా పిల్లులతో పోల్చితే పరిమాణంలో భారీగా ఉంటాయి. ఇదిలావుండగా, ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఇటీవల ఆ మహిళ ఉన్నట్టుండి మృతి చెందింది. తలుపులు మూసి ఉండడంతో ఎవరూ గుర్తించలేదు. సుమారు రెండు వారాల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. అయితే లోపల ఉన్న పిల్లుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో ఆకలితో అలమటించాయి. చివరకు తమ యజమాని మృతదేహాన్ని తినేశాయి. రెండు వారాల పాటు ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహాన్ని చాలా వరకు పిల్లలు తినేశాయి.

9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..


ఇటీవల ఓ రోజు సహోద్యోగి అయిన మహిళ.. మృతురాలి ఇంటికి వెళ్లింది. లోపల మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉండడం చూసి షాక్ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి సంబంధించి అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యానిమల్ రెస్క్యూ నిపుణులు మాట్లాడుతూ.. సాధారణంగా పిల్లులు మనిషిపై దాడి చేయవని, అయితే రెండు వారాల పాటు పిల్లులు ఇంట్లోనే ఉండడంతో ఆకలి కారణంగా దొరికింది తిన్నాయని చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కుక్కలు గూగుల్‪ని వినియోగిస్తే.. దేనికోసం శోధిస్తాయో.. మీకు తెలుసా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Updated Date - 2022-06-23T00:45:59+05:30 IST