Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 22 Jun 2022 16:03:03 IST

కుక్కలు గూగుల్‪ని వినియోగిస్తే.. దేనికోసం శోధిస్తాయో.. మీకు తెలుసా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

twitter-iconwatsapp-iconfb-icon

కుక్కలు విశ్వాసానికి మారు పేరు. కొన్ని కుక్కలు అందరినీ ఆశ్చర్యపరచేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు మనుషుల కంటే చాలా తెలివిగా ఆలోచిస్తాయి. కుక్కలు అచ్చం మనిషిలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది. ఇదే సందేహం నెట్ దిగ్గజం గూగుల్‌కు కూడా వచ్చింది. ప్రస్తుత హైటెక్ యుగంలో మనిషికి ఏం సమాచారం కావాలన్నా చిటికెలో చేతిలోకి వచ్చి చేరుతుంది. గూగుల్‌లో సర్చ్ చేస్తే తెలియని సమాచారం అంటూ ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కుక్కలు గూగుల్‌ను వినియోగిస్తే.. దేనికోసం వెతుకుతాయి. ఇదే ప్రశ్న గూగుల్.. తమ ట్విటర్ ద్వారా నెటిజన్లను అడిగింది.

కుక్కలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు గూగుల్.. జూన్ 22న ట్విట్టర్‌లో పోస్టును షేర్ చేసింది. మనం ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా, ఏ వివరాలు కావాలన్నా Googleకి వెళ్తాం. కానీ మీ కుక్క గూగుల్‌ను వినియోగిస్తే.. దేని కోసం వెతుకుతుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటూ.. "మీ కుక్క Googleని ఉపయోగించగలిగితే, అది దేని కోసం శోధిస్తుంది?" అని ప్రశ్నించింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

కనీవినీ ఎరుగని రీతిలో శునకాలకు పెళ్లి.. బంధువులందరికీ భోజనాలు.. డీజే పాటలతో ఊరంతా సందడే సందడి..!

‘‘ఎముకలు’’ అని ఒరు, “పెట్ స్నాక్స్” అని మరొకరు పేర్కొన్నారు. ఇంకా మరికొందరు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘'నేను ఎక్కువ ఆహారం ఎలా పొందగలను'’, ‘‘నా యజమాని నన్ను వాకింగ్‌కు తీసుకెళ్లేలా ఎలా చేయాలి’’, ‘‘నా యజమానిని ఎలా సంతోషపెట్టాలి’’, ‘‘ఎక్కువ కుక్కీలను ఎలా పొందాలి’’.. ఇలా వివిధ రకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న రంగు రంగుల స్కూటర్.. ఇంతకీ దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

రూ.28 చిల్లర కోసం గొడవ.. ఆటో వెంట పడుతూ ప్రాణాలు కోల్పోయిన టెకీ.. ఆరేళ్ల తర్వాత రూ.43 లక్షల పరిహారం.. 36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..ఒకే రోజు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.. తెల్లారినా ఆ ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూస్తే..నేను చనిపోయాకే నా విలువ మీకు తెలుస్తుందంటూ తల్లిదండ్రులకు మెసేజ్.. చనిపోయిన 21 ఏళ్ల యువకుడి మొబైల్‌లో..అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణంకంగారుగా ఇంటికొచ్చిన కూతురు.. ఏడుస్తూ.. అమ్మా!.. ఊరి బయట పొలంలో... అంటూ ఆమె చెప్పింది విని..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.