Nara Lokesh: నేను జగన్‌రెడ్డిలా పారిపోయే రకం కాదు

ABN , First Publish Date - 2022-12-07T21:46:55+05:30 IST

ఈ ప్యాలెస్‌ పిల్లి.. కాపీ క్యాట్ అని నారా లోకేష్‌ తెలిపారు. జయహో బీసీ సభ పేరు కూడా టీడీపీ నుంచి కాపీ కొట్టారని లోకేష్‌ విమర్శించారు.

Nara Lokesh: నేను జగన్‌రెడ్డిలా పారిపోయే రకం కాదు

అమరావతి: మంగళగిరిలోని నిడమర్రులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లోకేష్ ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. లోకేష్‌ పర్యటన సమయంలో నిడమర్రులో విద్యుత్ నిలిపివేశారు. ఫోన్‌ లైట్‌తోనే ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నట్లు లోకేష్‌ పేర్కొన్నారు. జగన్‌ పాలనలో అన్నిరకాలుగా నష్టపోయామని గ్రామస్తులు తెలిపారు. ఇళ్ల కూల్చివేతకు నోటీసులిచ్చారని లోకేష్‌కు బాధిత మహిళలు గోడు వినిపించారు. దీనిపై పోరాటం చేసి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలో 10 వేల ఇళ్లు నిర్మిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని లోకేష్‌ మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. తాను జగన్‌రెడ్డిలా పారిపోయే రకం కాదని, తనపై నిరాధార ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేస్తానని లోకేష్ అన్నారు.

ఈ ప్యాలెస్‌ పిల్లి.. కాపీ క్యాట్ అని నారా లోకేష్‌ తెలిపారు. జయహో బీసీ సభ పేరు కూడా టీడీపీ నుంచి కాపీ కొట్టారని లోకేష్‌ విమర్శించారు. జగన్‌రెడ్డి చుట్టూ ఉన్న నలుగురు రెడ్లకు బీసీలంటే నరనరాల్లో కోపం ఉందని, 24 మంది బీసీలను హత్య చేయించడమే జయహో బీసీ నినాదమా? అని లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ డీఎన్ఏ అంటేనే బీసీ, బీసీల గుండెల్లో టీడీపీ ఉంటుందని లోకేష్‌ అన్నారు. జగన్ బటన్ నొక్కితే చెత్తపన్ను పడిందని, నిత్యావసరాల ధరలు పెరిగాయని, జగన్‌రెడ్డి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలన్నీ గోవిందా గోవిందా అయ్యాయని లోకేష్‌ విమర్శించారు.

Updated Date - 2022-12-07T21:51:06+05:30 IST