Chandrababu: సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు.. నిద్రలేకుండా చేస్తానని హెచ్చరిక

ABN , First Publish Date - 2022-11-19T20:12:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu) విమర్శలు గుప్పించారు.

Chandrababu: సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు.. నిద్రలేకుండా చేస్తానని హెచ్చరిక

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu) విమర్శలు గుప్పించారు. పాలన చేతకాని దద్దమ్మ సీఎంతో మంత్రులకు ఫ్రస్ట్రేషన్ అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకేం ఫ్రస్ట్రేషన్ లేదని,.. మీకే నిద్రలేకుండా చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2 వేల నోట్లు కనపడట్లేదని, ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లో దాచిపెట్టడం, ఢిల్లీ తరలించడం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్‌లో నిలబెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా?, హైకోర్టు వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2022-11-19T20:22:09+05:30 IST