Passport: యూఏఈ పాస్‌పోర్ట్ చాలా పవర్‌ఫుల్ గురూ.. వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లొచ్చంటే..

ABN , First Publish Date - 2022-12-10T11:31:47+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పాస్‌పోర్ట్‌ ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ట్రావెల్ డాక్యూమెంట్‌గా నిలిచింది.

Passport: యూఏఈ పాస్‌పోర్ట్ చాలా పవర్‌ఫుల్ గురూ.. వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లొచ్చంటే..

ఎన్నారై డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పాస్‌పోర్ట్‌ ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ట్రావెల్ డాక్యూమెంట్‌గా నిలిచింది. ఆర్టాన్ క్యాపిటల్స్ ఇండెక్స్ ఆఫ్ వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ (Arton Capital’s Index of the world’s most powerful passport) ఈ విషయాన్ని వెల్లడించింది. యూఏఈ పాస్‌పోర్టుతో (UAE passport) వీసా లేకుండా ఏకంగా 180 దేశాలకు వెళ్చొచ్చు. ఏడు యూరోపియన్ దేశాలను వెనక్కి నెట్టి మరి యూఏఈ (UAE) ఈ ఘనతను సాధించింది. జర్మనీ, స్వీడెన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ పాస్‌పోర్టును కూడా యూఏఈ పాస్‌పోర్ట్ వెనక్కి నెట్టడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ (Henley & Partners) విడుదల చేసిన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో జపాన్ (Japan) పాస్‌పోర్ట్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు యూఏఈ పాస్‌పోర్ట్ దాన్ని దాటేసింది. కాగా, ఈ ఏడాది గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో యూఏఈ దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి (బుర్జ్ ఖలీఫా), లోతైన స్విమ్మింగ్ పూల్, ఎత్తైన హోటల్ తదితర ప్రత్యేకమైన కట్టడాలతో యూఏఈ తన ప్రత్యేకతను చాటుకుని ఈ మైలురాయిని చేరుకుంది.

Updated Date - 2022-12-10T11:33:47+05:30 IST