టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో World Kindness Day విజయవంతం

ABN , First Publish Date - 2022-11-23T16:36:22+05:30 IST

టచ్ ఏ లైఫ్ నిర్వహించిన TAL World Kindness Day శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ వేడుకలో ఎన్నో..

టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో World Kindness Day విజయవంతం

ఎన్నారై డెస్క్: టచ్ ఏ లైఫ్ నిర్వహించిన TAL World Kindness Day శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ వేడుకలో ఎన్నో అరుదైన కార్యక్రమాలు జరిగాయి. మన చుట్టూ ఉండే సామాజిక అంశాల గురించి అవగాహన పెంచేలా, పరిష్కారాన్ని సూచించేలా చర్చా కార్యక్రమాలు జరిగాయి. పేదరికం, ఆరోగ్యం, నిరక్షరాస్యత లాంటి ఎన్నో సమస్యలపై పలువురు చర్చించారు. ప్రముఖ విద్యావేత్త మేనియల్ సెరాపియో, రచయిత్రి యూలిన్ లీ వంటి నిపుణులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కన్వెన్షన్ సెంటర్లోని మరో వేదిక మీద కీనోట్ ప్రసంగాలు కొనసాగాయి. క్రిస్ సేలం, టెడ్ లెంపర్ట్, ఫ్రెడ్ టోవర్ వంటి ప్రపంచ స్థాయి నాయకులు తమ జీవిత అనుభవాలను, అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. దీంతో ప్రథమ్, అక్షయ పాత్రతో పాటు మరెన్నో సేవా సంస్థలెన్నో ఈ స్టాల్స్ ద్వారా తమ లక్ష్యాలను వివరించాయి.

Untitled-6.gif

యువతను Social Entrepreneursగా తీర్చిదిద్దే బూట్ క్యాంప్ World Kindness Day కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. విజ్జి సూర్యదేవర, కాత్యాయని వంటి నిపుణులు యువతను సామాజిక ఆవిష్కర్తలుగా మార్చే నైపుణ్యాలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన TALHero అవార్డుల కార్యక్రమం కూడా వరల్డ్ కైండ్‌నెస్ డే ప్రోగ్రామ్‌లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మంచి మనసుతో సేవ చేస్తూ సామాజంపై ప్రభావం చూసిన వారికి సంస్థలకు ఈ అవార్డులను అందించడం జరిగింది. కొవిడ్ సమయంలో అసాధారణమైన సాయం చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి పులి ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. TAL World Kindness Day సందర్భంగా 12 గంటల పాటు నృత్య, సంగీత కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల కళలతో పాటు సాయంత్రం వేళ జరిగిన కాన్సర్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ప్రముఖ గాయకులు హేమచంద్ర, వైష్ణవి, రేణు కుమార్, సుమంగళి పాల్గొన్న ఈ కాన్సర్ట్ చూసేందుకు వందలాది మంది ప్రేక్షకులు కన్వెన్షన్ సెంటర్‌కు తరలి వచ్చారు.

Untitled-9.gif

సెనెటర్ డేవ్ కోర్టిస్, ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, శాంతా క్లారా కౌన్సిల్ సభ్యులు రాజ్ చాహల్, శాంతా క్లారా మేయర్ లిసా గిల్మోర్, శాంతా క్లారా కౌన్సిల్ మెంబర్ కతి వాతనబి. శాంతా క్లారా కౌన్సిల్ సభ్యులు లిండా సెల్, డబ్లిన్ స్పెషల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అరుణ్ గోయల్, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వేరోస్, హేవార్డ్ కౌన్సిల్ సభ్యులు ఐషా వాహబ్, శాంతా క్లారా కౌంటీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రస్టీ పాటీ కర్టెసీ, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు జయరాం కోమటి, రామి రెడ్డి, శ్రీని మాదాల, కుమార్ శ్రీపాదం, ప్రసాద్ దాసరి, సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల, వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, స్థానిక ప్రముఖ నాయకులు కిరణ్ ప్రభ, రమేష్ తంగెళ్లపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవత్వాన్ని పంచేలా, పెంచేలా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనే అపూర్వమని ఈ సందర్భంగా వాళ్లు ప్రశంసించారు. TAL World Kindness Dayను రూపొందించిన టచ్ ఏ లైఫ్ వ్యవస్థాపకులు సాయి గుండవల్లి, వీణ గుండవల్ల, తేజ్, త్రిషలను అభినందించారు. ‘ప్రతి ఒక్కరూ తమ వంతుగా సాయం చేస్తూ.. ఇతరుల కోసం అడుగు ముందుకు వేస్తే లోకం మారిపోతుంది’ అనే సందేశంతో టాల్ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

Updated Date - 2022-11-23T16:36:25+05:30 IST