తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా దీపావళి సంబరాలు
ABN , First Publish Date - 2022-10-31T13:10:38+05:30 IST
తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా) అక్టోబర్ 29, 2022 శనివారం నాడు దీపావళి ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్ ఆడిటోరియంలో అంగ రంగ వైభవంగా నిర్వహించింది. ఎన్నడూ లేనంతగా 1500పైగా తెలుగు వాళ్లు ఈ వేడుకలో
ఎన్నారై డెస్క్: తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా) అక్టోబర్ 29, 2022 శనివారం నాడు దీపావళి ఉత్సవాలను టొరంటోలోని టొరంటో పెవిలియన్ ఆడిటోరియంలో అంగ రంగ వైభవంగా నిర్వహించింది. ఎన్నడూ లేనంతగా 1500పైగా తెలుగు వాళ్లు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, లిఖిత యార్లగడ్డ, ఇందు నిట్ల, విద్య బుద్ధరాజు, జయకిరణ్ కొనకాల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

మొదటగా తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి అతిథులకు ఆహ్వానం పలికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, కీర్తి కూన, శ్రీదేవి పేరిచర్ల, శృతి ఏలూరి, వీణ మార్పిన జ్యోతి ప్రజ్వలన చేసి దీపావళి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ.. సభికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, గత రెండేళ్లుగా తాకా చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి వివరించారు. ఆ తర్వాత 200 మందికి పైగా చిన్నారులు, కళాకారులు వారి ఆట పాటలతో, నృత్యాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. 40కి పైగా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు 7 గంటలపాటు కనీవినీ ఎరుగని రీతిలో సాగాయి.

ఈ సందర్భంగా తాకా కార్యవర్గం... సంస్థకు చేయూత ఇస్తున్న ప్రధాన దాతలు రమేష్ గోల్లు, ఆనంద్ పేరిచర్ల తదితరులను శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా తాకా వ్యవస్థాపక సభ్యులు హనుమంతాచారి సామంతపూడి మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరైన వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా గత 12 సంవత్సరాలుగా ఎంతగా కెనడాలో అభివృద్ధి చెందిందో వివరించారు. వేడుక సందర్భంగా తాకా రుచికరమైన వింధు భోజనాలు ఏర్పాటు చేసింది.

చివరిగా కల్పన మోటూరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జునచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల, రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్స్ విద్య భవనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్ కుందూరు, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, రామచంద్ర రావు దుగ్గినతోపాటు వలంటీర్లను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. చివరగా కెనడా మరియు భారత దేశ జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు.