TACA: తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

ABN , First Publish Date - 2022-12-14T16:10:38+05:30 IST

తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) శనివారం నాడు కెనడాలోని మిస్సిసాగ నగరంలో వున్న కెనెడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకల(Christmas Celebrations)ను నిర్వహించింది. మొదటగా..

TACA: తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

ఎన్నారై డెస్క్: తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) శనివారం నాడు కెనడాలోని మిస్సిసాగ నగరంలో వున్న కెనెడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకల(Christmas Celebrations)ను నిర్వహించింది. మొదటగా కెనడా, భారత దేశ భక్తి గీతాలను రాణి, ఆర్నాల్డ్ మద్దెల ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాకా ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల.. కార్యక్రమానికి హాజరైన అతిథులను స్వాగతించారు. శ్రీ దివ్య, రాకేష్ ఇద్దరూ క్రిస్మస్ ప్రేయర్‌తో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు 3 గంటలపాటు ఉల్లాసంగా సాగాయి. పిల్లలతో ఆడించిన క్రిస్మస్ బింగో ఆట అందరినీ అలరించింది. కాండిల్ ప్రేయర్స్ ప్రత్యేక ఆకర్హణగా నిలిచింది. రాణి మద్దెల అందరికీ క్రిస్మస్ మెసేజ్‌ను ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తాకా అధ్యక్షురాలు కల్పన మోటూరి, తాకా(Telugu Alliances of Canada) వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాకా చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ ఉత్సవాలలో పాల్గొన్న చిన్నారులందరికీ క్రిస్మస్(Christmas) బహుమతులు అందజేశారు.

Untitled-4.jpg

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల,రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మహమ్మద్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్ర రావు దుగ్గిన, ఆర్నాల్డ్ మద్దెల తదితరులను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, దాతలకు, అతిథులకు తాకా సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

Updated Date - 2022-12-14T16:19:07+05:30 IST