Kuwait: ప్రవాస బ్యాచిలర్స్‌కు అధికారులు షాక్.. ఊహించని కష్టంతో గగ్గోలు!

ABN , First Publish Date - 2022-11-13T09:56:44+05:30 IST

కువైత్‌లోని ఫర్వానియా (Farwaniya) ప్రాంతంలో ఉన్న పలు అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న ప్రవాస బ్యాచిలర్స్‌కు (Expat Bachelors) ఊహించని కష్టం వచ్చి పడింది.

Kuwait: ప్రవాస బ్యాచిలర్స్‌కు అధికారులు షాక్.. ఊహించని కష్టంతో గగ్గోలు!

కువైత్ సిటీ: కువైత్‌లోని ఫర్వానియా (Farwaniya) ప్రాంతంలో ఉన్న పలు అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న ప్రవాస బ్యాచిలర్స్‌కు (Expat Bachelors) ఊహించని కష్టం వచ్చి పడింది. విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ నియంత్రణ విభాగంలోని బ్యాచిలర్స్ కమిటీ ఈ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో భాగంగా ప్రవాస బ్యాచిలర్స్‌కు రూంలు అద్దెకు ఇచ్చిన అపార్ట్‌మెంట్లను గుర్తించి పవర్ కట్ చేస్తున్నారు. గడిచిన నెల రోజులుగా ఫర్వానియా గవర్నరేట్ పరిధిలో ఇలా సుమారు 100 అపార్ట్‌మెంట్స్‌కు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఈ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న బ్యాచిలర్స్ గగ్గోలు పెడుతున్నారు. జహ్రా (Jahra) ప్రాంతంలో కూడా కొన్ని అపార్ట్‌మెంట్స్ ఇలాగే పవర్ కట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే, ఈ విషయమై అధికారులు ఇంతకుముందే నోటీసులు ఇచ్చారట. ఆ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న ప్రవాస బ్యాచిలర్స్‌ను వెంటనే ఖాళీ చేయించాలని, లేనిపక్షంలో తగు చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. దీనికోసం కొంత గడువు కూడా ఇచ్చినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ, కువైత్ మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. కానీ, ఆయా అపార్ట్‌మెంట్స్ యజమానులు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేశారు. వారికి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత తాజాగా అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. దాంతో ఇంకా బ్యాచిలర్స్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్స్‌ను గుర్తించి పవర్ సప్లై ఆపేశారు. ఇప్పుడు ఈ 100 అపార్ట్‌మెంట్స్‌లోని ప్రవాస బ్యాచిలర్స్ తప్పనిసరిగా కువైత్ (Kuwait) విడిచివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2022-11-13T09:59:57+05:30 IST