Kuwait: ఒకేసారి ఏడుగురిని ఉరి తీసిన కువైత్‌!

ABN , First Publish Date - 2022-11-17T07:34:17+05:30 IST

కువైట్‌లో ఏడుగురు ఖైదీలకు బుధవారం ఒకేసారి మరణశిక్షను అమలు చేశారు.

Kuwait: ఒకేసారి ఏడుగురిని ఉరి తీసిన కువైత్‌!

దుబాయి, నవంబరు 16: కువైట్‌లో ఏడుగురు ఖైదీలకు బుధవారం ఒకేసారి మరణశిక్షను అమలు చేశారు. వీరిలో కువైట్‌కు చెందిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక సిరియన్‌, ఒక పాకిస్థానీ, ఒక ఇథియోపియన్‌ మహిళ ఉన్నారు. తన కేంద్ర కారాగారంలో ఈ మరణశిక్షలను అమలు చేసినట్టు కువైట్‌ తెలిపింది. కువైట్‌ చర్య పట్ల యూరోపియన్‌ యూనియన్‌ విమర్శలు గుప్పించింది. ఇలాంటి వాటిని నిలిపివేయాలని పిలుపునిచ్చింది.

Updated Date - 2022-11-17T07:34:19+05:30 IST