Kuwait: ప్రవాసులకు లోన్స్ ఇవ్వడం తిరిగి ప్రారంభించిన బ్యాంక్స్.. పైగా శాలరీ పరిమితిని కూడా తగ్గించేశాయ్

ABN , First Publish Date - 2022-11-15T10:42:07+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు మూడేళ్ల నుంచి కువైత్ బ్యాంకులు (Kuwait Banks) ప్రవాసులకు (Expatriates) లోన్స్ ఇవ్వడం నిలిపివేశాయి.

Kuwait: ప్రవాసులకు లోన్స్ ఇవ్వడం తిరిగి ప్రారంభించిన బ్యాంక్స్.. పైగా శాలరీ పరిమితిని కూడా తగ్గించేశాయ్

కువైత్ సిటీ: మహమ్మారి కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు మూడేళ్ల నుంచి కువైత్ బ్యాంకులు (Kuwait Banks) ప్రవాసులకు (Expatriates) లోన్స్ ఇవ్వడం నిలిపివేశాయి. అయితే, ఇప్పుడిప్పుడే తిరిగి పరిస్థితులు గాడిలో పడడంతో కొన్ని బ్యాంకులు మళ్లీ వలసదారులకు లోన్స్ (Loans) ఇవ్వడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ప్రవాసుల లోన్లకు సంబంధించిన పాలసీలను సైతం సవరించి ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న వలసదారులకు కూడా లోన్స్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనికోసం బ్యాంక్స్ కొత్త నిబంధనలు, షరతులను రెడీ చేశాయని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

అలాగే బ్యాంకులు ప్రవాసులకు లోన్స్ పొందడానికి కావాల్సిన కనీస శాలరీ పరిమితిని కూడా తగ్గించాయి. ఇంతకుముందు లోన్ కావాలంటే వలసదారులకు కనీస నెలవారీ వేతనం 500 దిర్హమ్స్‌గా (రూ.1లక్ష 32వేలు) ఉండేది. దీన్ని ఇప్పుడు 300 దిర్హమ్లకు(రూ.79వేలు) తగ్గించాయట. అంతేగాక కనీస పని వ్యవధి కూడా ఏడాదికి బదులుగా 4 నెలలకు తగ్గించబడింది. ఇక వినియోగదారుల రుణం విలువ అనేది వారి వేతనాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇకపోతే మిగతా లోన్ ప్రాసెస్ మొత్తం కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ (Central Bank of Kuwait) సూచనల అనుసారంగానే జరుగుతుందట. ఏదేమైనా ఇది కువైత్‌లోని ప్రవాసులకు ఉపశమనం కలిగించే విషయమే చెప్పాలి.

Updated Date - 2022-11-15T10:42:09+05:30 IST