Love Marriage: బెల్జియం యువతిని పెళ్లాడిన ఆటో డ్రైవర్..!

ABN , First Publish Date - 2022-11-26T08:21:04+05:30 IST

ప్రేమకు ఎల్లలులేవని చాటారు. పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్బాయి, బెల్జియంకు చెందిన అమ్మాయి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయమే ఇదంతా.

Love Marriage: బెల్జియం యువతిని పెళ్లాడిన ఆటో డ్రైవర్..!

బెల్జియం అమ్మాయి.. కర్ణాటక అబ్బాయి

హంపి: ప్రేమకు ఎల్లలులేవని చాటారు. పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. కర్ణాటకకు చెందిన అబ్బాయి, బెల్జియంకు చెందిన అమ్మాయి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయమే ఇదంతా. బెల్జియం యువతి కెమిల్‌, కర్ణాటక ఆటోడ్రైవర్‌ అనంతరాజు శుక్రవారం హంపిలో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తరచూ విహారయాత్రకు వచ్చే కెమిల్‌ అనంతరాజుతో 3 ఏళ్ల క్రితమే ప్రేమలో పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని విజయనగర్‌కు చెందిన అనంత్ రాజు ఆటో నడుపుతూ, ప్రముఖ హంపి దేవాలయంలో టూరిస్ట్‌గా గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బెల్జియం నుంచి వచ్చిన జీప్ ఫిలిప్ ఫ్యామిలీకి టూరిస్ట్ గైడ్‌గా వెళ్లాడు. వారి విహారయాత్రలో ఎంతగానో సాయం చేశాడు. ఆ సమయంలో అనంత రాజు మంచితనం నచ్చిన జీప్ ఫిలిప్ కూతురు కెమిల్ అతనితో స్నేహం పెంచుకుంది.

ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు మూడేళ్లు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత ఇరువురు తమ ఇంట్లోవారికి ప్రేమ విషయం చెప్పారు. వారు పెద్ద మనసుతో కెమిల్, రాజు వివాహానికి అంగీకరించారు. మొదట బెల్జియంలో ఘనంగా వివాహం చేయాలని అనుకున్నారు. కానీ, అనంత్ రాజు కోరిక మేరకు హిందూ సంప్రదాయం ప్రకారం భారత్‌లోనే వివాహం జరిపించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 9.25 గంటలకు హంపిలోని విరూపాక్ష దేవాలయంలో బంధుమిత్రుల మధ్య కెమిల్, అనంతరాజు పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో మూడేళ్ల ప్రేమకు శుభం కార్డ్ పడింది.

Updated Date - 2022-11-26T08:45:43+05:30 IST