NRI: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ఎన్నారైకి అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2022-11-27T08:56:28+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో (America) తెలుగు ఎన్నారై (Telugu NRI) సైంటిస్టుకు అరుదైన గౌరవం దక్కింది.
టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో (America) తెలుగు ఎన్నారై (Telugu NRI) సైంటిస్టుకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా చెర్లపల్లికి చెందిన శాస్త్రవేత్త డా. సాంబ రెడ్డికి (Dr. Samba Reddy) టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం (Texas A&M University) తమ అత్యున్నత పురస్కారం 'రీజెంట్స్ ప్రొఫెసర్ అవార్డు'తో (Regents Professor Award) సత్కరించింది. ఈ యూనివర్సిటీలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్ ఏ అండ్ ఎం స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 2008లో సాంబ రెడ్డి ఈ యూనివర్సిటీలో చేరారు. ఎపిలెప్సీ న్యూరోథెరపాటిక్స్‌లో అధ్యయనాలు చేస్తూ న్యూరో స్టెరాయిడ్స్ విభాగంలో ఎన్నో పరిశోధనలు చేశారు.
ఇక సాంబ రెడ్డి తెలంగాణలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో (Kakatiya University) ఫార్మసీ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు పట్టా అందుకున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లోని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ ఫెల్లోషిప్ పూర్తి చేశారు. కాగా, ఓ తెలుగు వ్యక్తికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.