Indian Embassy: భారతీయ ఇంజనీర్లకు మరో ఛాన్స్.. గడువు పొడిగించిన ఎంబసీ

ABN , First Publish Date - 2022-12-31T09:18:30+05:30 IST

కువైత్‌లో (Kuwait) ఇంజనీర్లుగా పనిచేస్తున్న భారతీయుల (Indian Engineers) కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) డిసెంబర్ 8న కొత్త రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను (Registration Drive) ప్రారంభించిన విషయం తెలిసిందే.

Indian Embassy: భారతీయ ఇంజనీర్లకు మరో ఛాన్స్.. గడువు పొడిగించిన ఎంబసీ

కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) ఇంజనీర్లుగా పనిచేస్తున్న భారతీయుల (Indian Engineers) కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం (Indian Embassy) డిసెంబర్ 8న కొత్త రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను (Registration Drive) ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించింది. 2023 జనవరి 7వ తేదీ వరకు భారత ఇంజనీర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఇంజనీర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదని వారి కోసం ఈ అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఇక చివరిసారిగా 2020లో భారతీయ ఇంజనీర్ల కోసం ఇలాంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో ప్రతి భారత ఇంజనీర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం చేపడుతున్న ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ రిఫరెన్స్ ప్రయోజనాల కోసం అవసరమైన ప్రస్తుత డేటాబేస్‌ను అప్‌డేట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని ఎంబసీ తెలిపింది.

ఎంబసీలో ఇంతకుముందు నమోదు చేసుకున్న వారితో సహా కువైత్‌లోని భారతీయ ఇంజనీర్లందరూ https://forms.gle/vFJaUcjjwftrqCYE6 లింక్‌లోని ఆన్‌లైన్ గూగుల్ ఫారమ్‌ను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు. తాజాగా పొడిగించిన గడువులోపు భారతీయ ఇంజనీర్లు అందరూ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలని రాయబార కార్యాలయం సూచించింది. ఇదిలాఉంటే.. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా కువైత్‌లో ప్రస్తుతం ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికెట్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సహాకారంతో కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (Kuwait Society of Engineers) ప్రవాస ఇంజనీర్లు తాము ఉద్యోగాల్లో చేరినప్పుడు సమర్పించిన సర్టిఫికెట్లను వెరిఫై చేస్తోంది.

Updated Date - 2022-12-31T09:19:02+05:30 IST