Kuwait: వరుసగా 5రోజులు సెలవులు

ABN , First Publish Date - 2022-12-09T07:45:22+05:30 IST

కువైత్‌లో (Kuwait) వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో వరుసగా ఐదు రోజులు సెలవులు (Holidays) వస్తున్నాయి.

Kuwait: వరుసగా 5రోజులు సెలవులు

కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో వరుసగా ఐదు రోజులు సెలవులు (Holidays) వస్తున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. కువైత్ నేషనల్ డే (Kuwait National Day), లిబరేషన్ డేలతో పాటు ఇస్రా, మిరాజ్‌ల సందర్భంగా ఈ లీవ్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఇస్రా, మిరాజ్ సెలవులు ఫిబ్రవరి 18 (శనివారం)తో సమానంగా ఉంటాయి. అయితే, ఈ సెలవులను తదుపరి గురువారానికి మార్చాలని, శనివారం సెలవును శచ్చే గురువారానికి బదిలీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లయితే వరుస సెలవులు వస్తాయి. అప్పుడు ఫిబ్రవరి 23న (గురువారం) విశ్రాంతి దినంగా ఉంటుంది. ఇక ఫిబ్రవరి 27(సోమవారం) అనేది ఫిబ్రవరి 25 (శనివారం)కి ప్రత్యామ్నాయంగా విశ్రాంతి దినంగా పరిగణించబడుతుంది. అయితే, దీనికి మంత్రి మండలి నిర్ణయం అవసరం. ఇదిలాఉంటే.. ఈ కొత్త ఏడాదికి కువైత్‌లో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. డిసెంబర్ 30 (శుక్రవారం), 31 (శనివారం), జనవరి 1 (ఆదివారం). తిరిగి జనవరి 2న (సోమవారం) యథావిధిగా కార్యాలయాలు తెరచుకుంటాయి.

Updated Date - 2022-12-09T07:45:24+05:30 IST