ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్‌లో ఉన్న భారత ప్రవాసుడికి.. సడెన్‌ ఫోన్ కాల్.. అందులో ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2022-11-26T10:48:30+05:30 IST

దుబాయ్‌లో (Dubai) ఓ హోటల్‌లో మేనేజర్‌గా (Hotel Manager) పని చేస్తున్న భారత ప్రవాసుడు (Indian Expat) ఒకరు ప్రస్తుతం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్ (Fifa World Cup) కోసం వెళ్లారు.

ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్‌లో ఉన్న భారత ప్రవాసుడికి.. సడెన్‌ ఫోన్ కాల్.. అందులో ఊహించని విధంగా..

అబుదాబి: దుబాయ్‌లో (Dubai) ఓ హోటల్‌లో మేనేజర్‌గా (Hotel Manager) పని చేస్తున్న భారత ప్రవాసుడు (Indian Expat) ఒకరు ప్రస్తుతం ఖతార్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్ కప్ (Fifa World Cup) కోసం వెళ్లారు. ఇప్పుడు అక్కడే ఉన్నారు. అలా ఖతార్‌లో వరల్డ్ కప్ మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్న అతడికి అబుదాబి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని మనోడు ఒక్కసారిగా ఎగిరిగంతేసినంత పని చేశాడు. ఇంతకీ భారతీయుడికి అవతలి వ్యక్తి ఫోన్‌లో చెప్పిన విషయం ఏంటి? అసలు ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. హరి జయరామ్ ( Hari Jayaram ) అనే భారత ప్రవాసుడు గత ఎనిమిదేళ్ల నుంచి యూఏఈలో (UAE) నివాసం ఉంటున్నాడు. దుబాయ్‌లోని ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. ఎక్కడ చిన్న మ్యాచులు జరిగిన వెంటనే అక్కడ వాలిపోయేవాడు. అలాంటిది నాలుగేళ్లకు ఒకసారి వచ్చే సాకర్ సమరం పొరుగున ఉండే ఖతార్‌లో జరుగుతుంటే మనోడు మిస్ చేసుకుంటాడా మరి. వెంటనే ఖతార్ వెళ్లిపోయాడు. అక్కడ ప్రత్యక్షంగా మ్యాచులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే, హరికి ఇంకో అలవాటు కూడా ఉంది. అదే లాటరీ టికెట్లు (Lottery Tickets) కొనుగోలు చేయడం. దాంతో గత ఏడాదిన్నరగా క్రమం తప్పకుండా అబుదాబి బిగ్ టికెట్‌లో (Abu Dhabi Big Ticket) పాల్గొంటున్నాడు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి రాఫెల్‌లో తరచూ టికెట్లు కొనడం చేస్తున్నాడు. ఇదే అతడికి తాజాగా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవల హరి తన స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కి ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్ (రూ.2.22కోట్లు) తగిలాయి. తాజాగా అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో హరికి ఈ జాక్‌పాట్ తగిలింది. దాంతో రాఫెల్ నిర్వాహకులు అతడికి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

అయితే, తాను అంతా భారీ మొత్తం గెలుచుకున్నట్లు ఫోన్ ద్వారా చెప్పడంతో అతడు మొదట నమ్మలేదట. ఎవరో ఫ్రాంక్ కాల్ చేసి ఆటపట్టిస్తున్నారని అనుకున్నాడట. ఆ కాల్ మాట్లాడి పెట్టేసిన తర్వాత వెంటనే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకున్నాడు. దాంతో నిజంగానే తాను రూ.2.22కోట్లు గెలుచుకున్నట్లు తెలుసుకున్నాడు. అంతే.. మనోడి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే ఈ విషయం మిగిలిన తన ఇద్దరు మిత్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో వారు సంబరపడిపోయారు. ఇప్పటికీ తాము ఇంత భారీ నగదు గెలిచామంటే నమ్మలేక పోతున్నానని.. ముగ్గురం సమానంగా పంచుకుంటామని హరి చెప్పుకొచ్చాడు. ఈ బహుమతిని తన జీవితంలో మరిచిపోలేనని, తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ మ్యాచులను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలా మరో హ్యాపీ న్యూస్ తెలియడం మాటల్లో చెప్పలేని అనుభూతి అని హరి జయరామ్ మురిసిపోతున్నాడు.

Updated Date - 2022-11-26T11:00:32+05:30 IST