దుబాయిలో ఘనంగా ప్రవాసుల క్రిస్మస్ వేడుకలు

ABN , First Publish Date - 2022-12-30T09:31:27+05:30 IST

దుబాయికి గల్ఫ్ దేశాలన్నింటిలోనూ అధునీక మరియు అభ్యుదయ, ప్రగతిశీల రాజ్యంగా పేరు ఉంది. దానికి తగినట్లుగా ఈసారి నగరంలో క్రిస్మస్ ఉత్సవాలు అత్యంత ఆర్భాటంగా జరిగాయి. పర్యాటకుల కేంద్రమైన గ్లోబల్ విలేజీలో ఏర్పాటు..

దుబాయిలో ఘనంగా ప్రవాసుల క్రిస్మస్ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయికి గల్ఫ్ దేశాలన్నింటిలోనూ అధునీక మరియు అభ్యుదయ, ప్రగతిశీల రాజ్యంగా పేరు ఉంది. దానికి తగినట్లుగా ఈసారి నగరంలో క్రిస్మస్ ఉత్సవాలు అత్యంత ఆర్భాటంగా జరిగాయి. పర్యాటకుల కేంద్రమైన గ్లోబల్ విలేజీలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్టు అందర్నీ ఆకర్షించింది. ఇక సెంట్ మేరి చర్చి వద్ద సాయంత్రం వేళ జరిగిన ఏసు ప్రార్థనల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రార్థనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయితే.. భారతీయులు ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళు అక్కడకు వెళ్లకుండానే తమకు నచ్చిన విధంగా క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి ఆరాధానాలతో జరుపుకొన్నారు.

Untitled-4.jpg

యోహోవా షాలోమ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కష్టకాలంలో ఆంధ్రకు చెందిన అనేక మంది పేద క్రైస్తవులను ఈ చర్చి ఆదుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రకు చెందిన క్రైస్తవులు ఈ చర్చి వద్దే క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నారు. సంఘ కాపరి అడిదల సంపద రావు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఉత్సవాలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఫెయిత్ చర్చికి చెందిన కె. ఏలియా రాజు ముఖ్య ప్రసంగికులుగా హాజరై తన సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఎన్నార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి పాల్గోన్నారు. ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్లు అక్రం, మోహన్ రావు తదితరులు కూడా మాట్లాడారు. దుబాయి నగరంలో పని చేస్తున్న తెలుగు క్రైస్తవ మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గోన్నారు.

Updated Date - 2022-12-30T09:34:14+05:30 IST