Viral Video: గర్ల్‌‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేద్దామనుకుని.. సముద్రంలో పడ్డాడు.. చివరికి!

ABN , First Publish Date - 2022-11-29T10:15:33+05:30 IST

లవ్‌లో ఉన్నవారు తాము ప్రేమించే వారికి ప్రపోజ్ చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలని, జీవితాంతం గుర్తుండిపోవాలని పరితపిస్తుంటారు.

Viral Video: గర్ల్‌‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేద్దామనుకుని.. సముద్రంలో పడ్డాడు.. చివరికి!

ఇంటర్నెట్ డెస్క్: లవ్‌లో ఉన్నవారు తాము ప్రేమించే వారికి ప్రపోజ్ చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలని, జీవితాంతం గుర్తుండిపోవాలని పరితపిస్తుంటారు. దీనికోసం కొందరు ఏకంగా సినిమాలలోని సీన్స్‌ను కూడా అనుకరిస్తుంటారు. అవి ఒక్కొసారి రివర్స్ అవుతుంటాయి. ఇదిగో ఈ అమెరికన్ విషయంలో కూడా ఇదే జరిగింది. లవర్‌కు వెరైటీగా ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న ఆ ప్రేమికుడికి జీవితాంతం గుర్తిండిపోయే అనుభవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్కాట్ క్లైన్ తన ప్రేయసి సుజీ టక్కర్‌కి కూసింత వెరైటీగా ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. దీనికోసం సముద్రాన్ని ఎంచుకున్నాడు. అది కూడా సుర్యాస్తమయంలో బోట్‌లో ప్రేయసిని సముద్రంలోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపు ప్రియురాలితో టైటానిక్ మూవీ ఫోజ్‌లో నిలబడ్డాడు. అలా సముద్రంలో స్పెషల్ బోట్‌లో ప్రయాణిస్తూ.. టైటానిక్ ఫోజ్‌లో నిల్చొని రింగ్‌తో ప్రపోజ్ చేయాలనేది స్కాట్ ప్లాన్. కానీ, కరెక్టుగా జేబులోంచి రింగ్ తీసి ప్రపోజ్ చేద్దామనుకున్న సమయానికి అలల తాకిడికి బోట్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. అంతే రింగ్ ఉన్న చిన్న బాక్స్ కాస్తా సముద్రంలో పడిపోయింది. దాంతో మనోడు ఏమాత్రం ఆలోచించకుండా సముద్రంలోకి దూకేశాడు. కొద్దిసేపటి తర్వాత ఉంగరం ఉన్న బాక్స్‌తో బోట్‌పైకి వచ్చేశాడు స్కాట్.

ఆ తర్వాత టక్కర్‌ చేతికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాడు. స్కాట్ అంత సాహసోపేతం చేసి మరి తనకు ప్రపోజ్ చేస్తే ఆమె మాత్రం ఎందుకు కాదంటుంది. వెంటనే ఓకే చెప్పేసింది. అయితే, ఈ ఘటనను బోట్‌లో ఉన్న వారి స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. "100కి 100శాతం నిజం, 100శాతం లక్, 100శాతం ఈ ఘటనను మరిచిపోలేను" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 'ప్రేమే జీవితం కాదు. దాని కంటే జీవితం ఎంతో విలువైనది', 'నీది సముద్రం కన్నా లోతైన ప్రేమ', 'నిజంగానే ఇది చాలా ప్రత్యేకం. మీ ఇద్దరికి కంగ్రాట్స్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - 2022-11-29T11:34:58+05:30 IST