Kuwait: షాకింగ్ గణాంకాలు.. కువైత్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో 99 శాతం మంది వారేనట..!

ABN , First Publish Date - 2022-11-16T10:02:36+05:30 IST

2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ద్వారా కువైత్ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొంతకాలంగా నియామకాల విషయమై వలసదారుల పట్ల ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది.

Kuwait: షాకింగ్ గణాంకాలు.. కువైత్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో 99 శాతం మంది వారేనట..!

కువైత్ సిటీ: 2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ద్వారా కువైత్ స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే గడిచిన కొంతకాలంగా నియామకాల విషయమై వలసదారుల పట్ల ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నాన్-కువైటీలకు ప్రాధాన్యం తగ్గించింది. రెండు రంగాల్లోనూ భారీ మొత్తంలో స్థానికులకు అవకాశాలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బందికి (Kuwait Airport workers) సంబంధించి షాకింగ్ డేటాను వెల్లడించింది. ప్రస్తుతం కువైత్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 99శాతం మంది కువైటీలే (Kuwaitis) ఉన్నట్లు పేర్కొంది. ఆపరేషన్స్, నిర్వాహణ, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇలా దాదాపు ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో కువైటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కువైత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సలేహ్ అల్-ఫద్దాగి తెలిపారు.

అలాగే సెక్యూరిటీ అండ్ సెఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లోనూ విమానాశ్రయం చాలా మంది నైపుణ్యం కలిగిన కువైటీ ఉద్యోగులను కలిగి ఉందని ఆయన చెప్పారు. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology) సేవలు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన వృద్ధిని సాధించాయని, ముఖ్యంగా కరోనావైరస్ సంక్షోభ సమయంలో అని అల్-ఫద్దాగి చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సంస్థలతో సమాచారాన్ని అనుసంధానించే ప్రక్రియలో డీజీసీఏ (DGCA) చివరి దశలో ఉందని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం అందించే ఆన్‌లైన్ సేవల్లో ఎయిర్‌పోర్టు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు తమ ఫిర్యాదులు పంపవచ్చని చెప్పారు.

Updated Date - 2022-11-16T10:02:38+05:30 IST