Nepal: నేపాల్ దేశంలో రెండుసార్లు భూకంపం

ABN , First Publish Date - 2022-12-28T05:54:21+05:30 IST

నేపాల్ దేశంలో బుధవారం తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించింది....

Nepal: నేపాల్ దేశంలో రెండుసార్లు భూకంపం
Two Earthquakes Strike Nepal

ఖాట్మండు(నేపాల్): నేపాల్ దేశంలో బుధవారం తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించింది.(Two Earthquakes Strike) నేపాల్‌లోని బగ్‌లుంగ్ జిల్లాలో(Baglung district) రెండు భూకంపాలు వచ్చాయి.(Nepal)బగ్‌లుంగ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.7, 5.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని నేపాల్‌లోని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ( National Earthquake Monitoring Research Center) తెలిపింది.బగ్ లుంగ్ జిల్లా చౌర్ చుట్టూ బుధవారం తెల్లవారుజామున 1.23 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో రెండవ భూకంపం బగ్లుంగ్ జిల్లాలోని ఖుంగా చుట్టూ బుధవారం తెల్లవారుజామున 2:07 గంటలకు సంభవించినట్లు నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ట్వీట్ చేసింది.ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. గతంలోనూ నేపాల్ దేశంలో పలుసార్లు భూకంపాలు వచ్చాయి. తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం ఉలిక్కిపడి లేచారు.

Updated Date - 2022-12-28T05:54:22+05:30 IST