Rajinikanth: అందరూ బాగుండాలి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

ABN , First Publish Date - 2022-12-16T07:31:01+05:30 IST

సినీహీరో రజనీకాంత్‌ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామి(Venkateswara Swamy)ని దర్శించుకున్నారు.

Rajinikanth: అందరూ బాగుండాలి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

తిరుమల, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): సినీహీరో రజనీకాంత్‌ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామి(Venkateswara Swamy)ని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గురువారం వేకువజామున శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. కుమార్తె ఐశ్వర్యతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల తర్వాత స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామిని ఎప్పుడు దర్శించుకున్నా వినూత్న అనుభూతి కలుగుతుందన్నారు. దాన్ని వర్ణించడం సాధ్యం కాదన్నారు. ప్రజలందరూ బాగుండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రజనీకాంత్‌ శ్రీవారి ఆలయంలోకి వెళ్లే సమయంలో, బయటకు వచ్చిన సమయంలో అభిమానులు ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు.కొంతమంది తలైవా.. తలైవా.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన కడప దర్గాకు బయల్దేరి వెళ్లారు.

Updated Date - 2022-12-16T07:31:03+05:30 IST