Kabul : చైనా వ్యాపారవేత్తలు బస చేసే హోటల్‌లో పేలుళ్లు, కాల్పులు

ABN , First Publish Date - 2022-12-12T17:30:13+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని నగరం కాబూల్‌ (Kabul)లో చైనా (China) వ్యాపారవేత్తలు బస చేసే ప్రముఖ

Kabul : చైనా వ్యాపారవేత్తలు బస చేసే హోటల్‌లో పేలుళ్లు, కాల్పులు
Blast and gunfire in a Chinese Guest House in Kabul

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని నగరం కాబూల్‌ (Kabul)లో చైనా (China) వ్యాపారవేత్తలు బస చేసే ప్రముఖ హోటల్‌పై సోమవారం భయానక దాడి జరిగింది. ఈ దారుణ సంఘటనలో పెద్ద ఎత్తున పేలుళ్ళు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో ఒకటైన షహర్-ఈ-నా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

తాలిబన్లు (Taliban) అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు చైనా నుంచి వ్యాపారుల రాకపోకలు పెరిగాయి. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తాలిబన్ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం కొందరు వ్యక్తులు ఈ హోటల్‌లోకి ప్రవేశించి, దాడి చేశారు. వారిని మట్టుబెట్టేందుకు ప్రతిచర్యలు ప్రారంభమయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

సంఘటన స్థలానికి తాలిబన్ స్పెషల్ ఫోర్సెస్ హుటాహుటిన వెళ్తుండటం స్థానిక మీడియా చానళ్ళలో కనిపిస్తోంది. చైనా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య 76 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని చైనా అధికారికంగా గుర్తించలేదు. కానీ దౌత్య సంబంధాలను మాత్రం సంపూర్ణ స్థాయిలో నడుపుతోంది. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో ఉన్న వీఘర్ ముస్లిం వేర్పాటువాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం ఇస్తుందనే ఆందోళన చైనాకు చాలా కాలం నుంచి ఉంది. తాము ఉగ్రవాదులకు స్థానం ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా తాలిబన్లకు ఆర్థిక సహకారాన్ని చైనా అందజేస్తోంది.

Updated Date - 2022-12-12T17:32:35+05:30 IST