NTR30: హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ చేయాలనుకుంటోందా?

ABN , First Publish Date - 2022-11-01T16:59:40+05:30 IST

అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor).. ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు.. సిద్ధమవుతోందా? ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమాలో

NTR30: హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ చేయాలనుకుంటోందా?
Janhvi Kapoor and Jr NTR

అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor).. ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు సిద్ధమవుతోందా? ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమాలో ఆమె నటించాలని అనుకుంటోందా? కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల గురించి, అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోన్న తీరు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది. వాస్తవానికి ‘లైగర్’ (Liger) సినిమాతో జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఎంతగానో ప్రయత్నించారు. ఈ విషయం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో కూడా పూరి తెలిపారు. ‘లైగర్’ కంటే ముందు కూడా చాలా సినిమాల విషయంలో జాన్వీ కపూర్‌ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. బోనీకపూర్ కూడా జాన్వీకపూర్ సౌత్ ఎంట్రీ గురించి మాట్లాడారు కానీ.. సమయం ఉందని చెప్పారు. జాన్వీ మాటలు చూస్తుంటే.. ఇప్పుడాసమయం వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే.. బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా.. బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలేవీ విజయం సాధించలేకపోతున్నాయి.. కేవలం ఓటీటీకే ఆమె చిత్రాలు అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడామెకు బాలీవుడ్‌లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ పరిధి ఏ విధంగా మారిపోయిందో తెలియంది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎంట్రీ ఎన్టీఆర్ సినిమాతో అయితే బాగుంటుందని కూడా జాన్వీ భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ సినిమా తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట హీరోయిన్‌గా ఆలియా భట్ అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. ఆ ఛాన్స్ కోసం జాన్వీ కపూర్ ట్రై చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. తన తాజా ఇంటర్వ్యూలో సౌత్‌లో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారనే ప్రశ్నకు.. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా.. ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. ఎన్టీఆర్ అద్భుత నటుడని, ఆయనతో నటించేందుకు ఎంతోగానో వేచి చూస్తున్నానని.. జాన్వీ తెలిపింది. ఆమె ఈ సమాధానం తర్వాత.. ‘NTR30’ టీమ్ కూడా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నిస్తునట్లుగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే మాత్రం ‘NTR30’లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..? (Janhvi Kapoor eye on South Cine Industry)

Updated Date - 2022-11-01T17:14:45+05:30 IST