India Vs China : భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధం : చైనా

ABN , First Publish Date - 2022-12-25T14:30:31+05:30 IST

భారత దేశంతో సంబంధాలు నిలకడగా కొనసాగేందుకు, పటిష్టంగా వృద్ధి చెందేందుకు ఆ దేశంతో కలిసి

India Vs China : భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధం : చైనా
India China

న్యూఢిల్లీ : భారత దేశంతో సంబంధాలు నిలకడగా కొనసాగేందుకు, పటిష్టంగా వృద్ధి చెందేందుకు ఆ దేశంతో కలిసి పని చేస్తామని చైనా ప్రకటించింది. దౌత్య మార్గాల్లో సంప్రదింపులను ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. డిసెంబరు 9న భారత సైన్యంతో చైనా సైనికులు ఘర్షణ పడిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ ప్రకటన చేశారు.

వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. దౌత్య మార్గాలు, సైన్యాల మధ్య కమ్యూనికేషన్‌ను ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయని తెలిపినట్లు పేర్కొంది.

భారత్, చైనా కమాండర్ లెవెల్ 17వ విడత చర్చలు డిసెంబరు 20న జరిగిన సంగతి తెలిసిందే. వెస్టర్న్ సెక్టర్‌లో భద్రత, సుస్థిరతలను కొనసాగించాలని ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చాయి.

Updated Date - 2022-12-25T14:31:57+05:30 IST