Omicron BF.7: ఇండియాలో బయపడిన 3 కేసులు

ABN , First Publish Date - 2022-12-21T18:46:22+05:30 IST

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో వైరస్ విజృంభణకు కారణంగా భావిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్‌7 జాడలు ఇప్పుడు

Omicron BF.7: ఇండియాలో బయపడిన 3 కేసులు

ఢిల్లీ: చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో వైరస్ విజృంభణకు కారణంగా భావిస్తున్న ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ బిఎఫ్‌7 (BF.7) జాడలు ఇప్పుడు భారత్‌లోనూ కనిపిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఇంతవరకూ 3 కేసులు నమోదయ్యాయి. తొలి కేసును గత అక్టోబర్‌లోనే గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఇంతవరకూ గుజరాత్ నుంచి రెండు కేసులు, ఒడిశా నుంచి ఒక కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుక్ మాండవీయ బుధవారంనాడు కోవిడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్ వెలుగుచూసినప్పటికీ మొత్తం కేసుల్లో పెరుగుదల గణనీయం లేదని ఈ సమావేశంలో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కొత్తగా బయటపడుతున్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించింది. జినోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం సూచించినట్టు చెబుతున్నారు.

చైనాలో...

అధికార వర్గాల సమాచారం ప్రకారం చైనా నగరాల్లో ప్రధానంగా బిఎప్7 వేరియంట్ వ్యాప్తిలో ఉంది. దీంతో గణనీయంగా అక్కడ కేసులు పెరుగుతున్నాయి. చైనా ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉండటం, వ్యాక్సినేషన్ సామర్థ్యం కూడా బీఎఫ్7 వేగంగా విస్తరిస్తుండటానికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2022-12-21T18:55:16+05:30 IST