Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఆదిత్య థాకరే

ABN , First Publish Date - 2022-11-11T19:08:53+05:30 IST

హింగోలి: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శివసేన నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే శుక్రవారంనాడు...

Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఆదిత్య థాకరే

హింగోలి: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో శివసేన (Shiv sena ubt) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే (Aditya Thackeray) శుక్రవారంనాడు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కలమ్‌నురి వద్దకు భారత్ జోడో యాత్ర రాగానే రాహుల్‌తో కలిసి పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆదిత్యతో పాటు శాసనసభలో ఆ పార్టీ విపక్ష నేత అంబాదాస్ దన్వే, మాజీ ఎమ్మెల్యే సచిన్ అహిర్ పాదయాత్ర సాగించారు. భారత్ జోడా యాత్రలో పాల్గొనాలని పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరేకు కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. శుక్రవారంతో రాహుల్ చేపట్టిన యాత్ర 65వ రోజుకు చేరుకుంది.

దేశ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు సాగిస్తున్న రాహుల్ యాత్రలో ఇప్పటి వరకూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాహుల్ సైతం మహారాష్ట్ర పర్యటనలో ఆ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను తన్నుకుపోయిన వైనంపై బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే అంశాన్ని ఆదిత్య సైతం ఇటీవల కాలంలో పలుమార్లు ప్రస్తావించారు. త్వరలో బీఎంసీ సహా పలు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో రాహుల్‌ యాత్రలో ఆదిత్య పాలుపంచుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే పరోక్ష సంకేతం ఇచ్చినట్టు భావిస్తున్నారు.

Updated Date - 2022-11-11T19:08:57+05:30 IST