భూగర్భ గదుల సోదాకు అంగీకరించేది లేదు

ABN , First Publish Date - 2022-11-03T04:40:27+05:30 IST

జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో ఉన్న రెండు భూగర్భ గదుల (తహ్ఖానాలు)ను సోదా చేయాలన్న హిందువుల డిమాండ్‌పై మసీదు కమిటీ కోర్టులో అభ్యంత

భూగర్భ గదుల సోదాకు అంగీకరించేది లేదు

హిందువుల డిమాండ్‌పై జ్ఞానవాపి మసీదు కమిటీ అభ్యంతరం

వారాణసీ, నవంబరు 2: జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో ఉన్న రెండు భూగర్భ గదుల (తహ్ఖానాలు)ను సోదా చేయాలన్న హిందువుల డిమాండ్‌పై మసీదు కమిటీ కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. మసీదులో ఎటువంటి మార్పులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశమని, భూగర్భగదుల తాళాలను తీసి లోపల సోదా చేయడమంటే ఆ ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని కమిటీ తరపు న్యాయవాది జిల్లా కోర్టుకు తెలిపారు. మరోవైపు.. జ్ఞానవ్యాపి ప్రాంగణంలో లభించిన లక్ష్మీ గణేశ ప్రతిమకు రక్షణ కల్పించాలని హిందూ వర్గం కోర్టును కోరింది. మసీదు కమిటీ అభ్యంతరంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-11-03T04:40:50+05:30 IST
Read more