Imran Khan: దాడి ప్లాన్ ప్రధానిదే.. ప్రతీకారం తీర్చుకుంటానన్న ఇమ్రాన్..

ABN , First Publish Date - 2022-11-03T21:26:07+05:30 IST

వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం.

Imran Khan: దాడి ప్లాన్ ప్రధానిదే.. ప్రతీకారం తీర్చుకుంటానన్న ఇమ్రాన్..

లాహోర్: కాల్పుల ఘటన నుంచి గాయాలతో బయటపడిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించారు. దేవుడు తనకు మరో జన్మ ప్రసాదించారని చెప్పారు. మరోవైపు దాడికి పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ కారణమని ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. వీరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటనను పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటనను ఖండించారు. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇటు లాహోర్ ఆసుపత్రిలో ఇమ్రాన్ ఖాన్‌కు చికిత్స అందించారు. ఇమ్రాన్ రెండు కాళ్లకూ బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం. ఘటనలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఇమ్రాన్‌పై ఇద్దరు అంగతకులు కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని పీటీఐ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల వల్ల ఎక్కువగా చప్పుడు వస్తోందని, తాను నమాజ్ చేసుకోలేకపోతున్నందుకే దాడి చేశానని నిందితుడు చెప్పాడు.

ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇమ్రాన్‌పై కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరోవైపు కాల్పుల ఘటనకు నిరసనగా ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

Updated Date - 2022-11-03T21:27:19+05:30 IST