కంటి నిండా నిద్ర పట్టాలంటే.. ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2022-04-27T17:25:44+05:30 IST

నిద్ర పట్టకపోవడం, పట్టినా తరచూ మెలకువ రావడం నిద్రలేమి లక్షణాలు. ఈ సమస్య తొలగి, కంటి నిండా నిద్ర పట్టాలంటే ఈ యోగాసనాలు సాధన చేయాలి.

కంటి నిండా నిద్ర పట్టాలంటే.. ఇలా చేసి చూడండి!

ఆంధ్రజ్యోతి(27-04-2022)

నిద్ర పట్టకపోవడం, పట్టినా తరచూ మెలకువ రావడం నిద్రలేమి లక్షణాలు. ఈ సమస్య తొలగి, కంటి నిండా నిద్ర పట్టాలంటే ఈ యోగాసనాలు సాధన చేయాలి.


మార్జాల బితిలాసనం: వెన్ను, మెడ ప్రదేశాల్లో ఒత్తిడి తొలగి, శ్వాస క్రమమవ్వాలంటే ఈ ఆసనం సాధన చేయాలి. ఈ ఆసనం కోసం మోకాళ్ల మీద కూర్చుని, ముందుకు వంగి అరచేతులను నేల మీద ఆనించి, బల్ల మాదిరిగా మారాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకుంటూ ఛాతీని కిందకు వంచి, తలను పైకి లేపాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదులూ, వెన్నును పైకి లేపాలి. ఇలా వెన్నును పైకి లేపేటప్పుడు, తలను దింపి, ఛాతీ వైపు చూడాలి. ఇలా వెన్నును పైకీ, కిందకూ లేపుతూ దింపుతూ వీలైనన్ని సార్లు మార్జాల బితిలాసనం సాధన చేయాలి.


బాలాసనం: వెన్ను, భుజాల మీద ఒత్తిడిని తగ్గించే ఈ ఆసనం కోసం... మోకాళ్లను మడిచి కూర్చోవాలి. చేతులు రెండు పైకి చాపి, నడుము పైభాగాన్ని ముందుకు వంచుతూ, నుదుటిని, అర చేతులను నేలకు ఆనించాలి. ఈ భంగిమలో ఉన్నప్పడు, పిరుదులు పాదాలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో కొన్ని క్షణాలు ఉండి, తిరిగి యధాస్థానానికి రావాలి. ఇలా కనీసం ఐదు సార్లు సాధన చేయాలి.

Read more