పొట్ట కరగాలంటే.. వెంటనే ఇది ట్రై చేయండి..!

ABN , First Publish Date - 2022-02-22T18:15:03+05:30 IST

ఉరుకుల పరుగుల జీవితంలో శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఇందుకోసం తోడ్పడే యోగాసనాలు ఇవి.

పొట్ట కరగాలంటే.. వెంటనే ఇది ట్రై చేయండి..!

ఆంధ్రజ్యోతి(22-02-2022)

ఉరుకుల పరుగుల జీవితంలో శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఇందుకోసం తోడ్పడే యోగాసనాలు ఇవి.


అర్ధ హలాసనం

పడుకొని చేతులు రెండూ దూరంగా ఉంచాలి. కుడికాలు పైకి ఎత్తాలి. అలా కొంత సమయం ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ కాలిని కిందికి విడిచి.. శ్వాస తీసుకుంటూ పైకి కాలు ఎత్తాలి. ఆ తర్వాత ఎడమ కాలితో అలా చేయాలి. వీలైనన్ని సార్లు చేయాలి. ఈ అర్ధ హలాసనం ద్వారా పొట్ట తగ్గిపోతుంది. 


ధనురాసన

బోర్లాపడుకుని రెండు కాళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. శ్వాస పీల్చుకోవాలి. పొట్టమీద అలాగే ఉండాలి. తలను పైకి ఎత్తాలి. ఇలా చేశాక.. రిలాక్స్‌ అవ్వాలి. ఈ ఆసనం వల్ల జీర్ణకోశ సమస్యలు, మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి. వెన్ను నొప్పి ఉండేవాళ్లు ఈ ఆసనం వేయకూడదు. 


సింహాసన

నేలపై కూర్చుని రెండు కాళ్లను వెనకకు మడుచుకోవాలి. పాదాల మీద కూర్చోవాలి. అరచేతుల్ని మోకాళ్లపై ఉంచాలి. మోచేతులు ముడవకూడదు. తలను ముందుకు వంచి. నాలుక బయటపెట్టి ఊపిరి గట్టిగా పీల్చుతూ వదలాలి. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. టెన్షన్‌ తగ్గుతుంది. 

Updated Date - 2022-02-22T18:15:03+05:30 IST