బితిలాసనంతో బోలెడు ప్రయోజనాలు

ABN , First Publish Date - 2022-08-23T18:07:15+05:30 IST

క్యాట్‌/కౌ పోజ్‌గా పేర్కొనే బితిలాసనంతో ఆహార, జీర్ణ నాళాలు, పునరుత్పత్తి వ్యవస్థలు బలపడతాయి

బితిలాసనంతో బోలెడు ప్రయోజనాలు

క్యాట్‌/కౌ పోజ్‌గా పేర్కొనే బితిలాసనంతో ఆహార, జీర్ణ నాళాలు, పునరుత్పత్తి వ్యవస్థలు బలపడతాయి. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుంది. వెన్ను నొప్పి, సయాటికాల ఇబ్బందులు తొలగుతాయి. అలాగే ఈ ఆసనంతో మెడ, భుజాలు, వెన్ను సాగి, ఫ్లెక్సిబిలిటీ సమకూరుతుంది. అలాగే పిరుదులు, వెన్ను, పొత్తికడుపు, ఛాతీ, ఊపిరితిత్తుల కండరాలు విప్పారి, ఆయా ప్రదేశాల్లోని అసౌకర్యాలు తగ్గుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....


  • చేతులను నేల మీద ఆనించి, మోకాళ్ల మీద కూర్చోవాలి. 
  • తలను పైకి లేపి, వెన్నును కిందకు వంచాలి.
  • తర్వాత తలను కిందకు దించి, ఛాతీని చూస్తూ, వెన్నును పైకి లేపాలి. 
  • తలను పైకి లేపేటప్పుడు శ్వాస తీసుకుని, కిందకు దింపేటప్పుడు శ్వాస వదలాలి. 
  • ఇలా ఐదు నుంచి పది సార్లు చేయాలి.

Read more