వ్యాయామం చేయడం మొదలుపెట్టిన నాలుగు రోజులకే మానేస్తున్నారా? అయితే..

ABN , First Publish Date - 2022-02-28T16:27:04+05:30 IST

కొంతమంది వ్యాయామం చేయాలని అనుకుంటారు, కానీ చేయరు. మరి కొంతమంది ఉత్సాహంగా మొదలుపెడతారు. తరువాత నాలుగు రోజులకే

వ్యాయామం చేయడం మొదలుపెట్టిన నాలుగు రోజులకే మానేస్తున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(28-02-2022)

కొంతమంది వ్యాయామం చేయాలని అనుకుంటారు, కానీ చేయరు. మరి కొంతమంది ఉత్సాహంగా మొదలుపెడతారు. తరువాత నాలుగు రోజులకే మానేస్తారు. అయితే వ్యాయామంతో ఒనగూరే లాభాలు తెలిస్తే వెంటనే వ్యాయామానికి సిద్ధమైపోతారు. వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి...


వ్యాయామం మొదలుపెట్టగానే...

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లను శరీరం నాలుగు రెట్లు వేగంగా జీర్ణం చేస్తుంది. ఫలితంగా వేగంగా బరువు తగ్గుతారు. మీ మూడ్‌ను మార్చేందుకు ఉపయోగపడే ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో మెదడు వేగం పెంచుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు...జీవక్రియల రేటు పెరుగుతుంది.ఆక్సిజన్‌ ప్రవాహం నిమిషానికి 8 లీటర్ల నుంచి 100 లీటర్లకు పెరుగుతుంది. రక్తం సరఫరా పెరగడంతో రక్తకణాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను, పోషకాలను రక్తం నుంచి పొందుతాయి. 


కొన్ని వారాలు క్రమంతప్పకుండా వ్యాయామం చేసిన తరువాత...

ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.గుండె, రక్తనాళాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి.మీరు గతంలో కన్నా ఎక్కువ కష్టపడగలుగుతారు.హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. రక్తంలో లింపోసైట్ల సంఖ్య పెరుగుతుంది.శరీరం సులువుగా రక్తంలోని గ్లూకోజ్‌ నిలువలను నియంత్రిస్తుంది. శరీరం కొవ్వును తక్కువ నిలువ చేసుకుంటుంది. 


కొన్ని నెలల తరువాత..

ఒత్తిడి మీ దరిచేరదు. ఆందోళన, మానసిక అలజడి లేకుండా సంతోషంగా కనిపిస్తారు.కండరాలకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. సూక్ష్మరక్తనాళాలలో రక్తసరఫరా మెరుగుపడుతుంది.నరాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. నిర్ణయాలు వేగంగా తీసుకోగలుగుతారు.కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి.


వ్యాయామం చేసిన కొన్ని గంటల తరువాత...

మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రక్తపోటు సాధారణ స్థితిలో ఉంటుంది.మంచి నిద్ర పడుతుంది. 


కొన్ని ఏళ్ల తరువాత..

జీవితకాలం పెరుగుతుంది.దీర్ఘకాలం యవ్వనంగా ఉంటారు.

Updated Date - 2022-02-28T16:27:04+05:30 IST