menstrual pain : బహిష్టు నొప్పిని తిప్పికొట్టే ఐదు ఆహార పదార్థాలు ఇవే..!

ABN , First Publish Date - 2022-11-30T15:16:55+05:30 IST

బహిష్టు నొప్పి శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మహిళల మానసిక స్థితి, పని, ఇతర విషయాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది.

menstrual pain : బహిష్టు నొప్పిని తిప్పికొట్టే ఐదు ఆహార పదార్థాలు ఇవే..!
menstrual pain

ప్రతి స్త్రీ బహిస్టు సమయంలో విపరీతమైన కడుపు నొప్పిని అనుభవిస్తుంది. బహిష్టు నొప్పి శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మహిళల మానసిక స్థితి, పని, ఇతర విషయాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. రుతుక్రమంలో వచ్చే తిమ్మిర్లు, ఒంటి నొప్పులు, నడుం నొప్పులకు ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చు. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఐదు పదార్థాలు ఇవే..

1. క్రూసిఫరస్ కూరగాయలు

క్రూసిఫెరస్ కూరగాయలు సాధారణంగా ఆకుపచ్చ ఆకు కూరలు. అందులో ముఖ్యంగా బచ్చలికూర, కాలే, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనవి. వాటిలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఈ రెండూ పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

2. చేప

చేపలలో ఐరన్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలైనవి తినడం వల్ల రుతుక్రమంలో నొప్పి తగ్గుతుంది. చేపల్లో ఈ పోషకాలు ఉంటాయి. అందుకే బహిష్టు సమయంలో చేపలు తినడం మంచిది.

3. పసుపు

పసుపులో గొప్ప ఆరోగ్యాన్ని కాపాడే గుణాలున్నాయి.. ఇది తిమ్మిరి, ఇతర రుతుక్రమ లక్షణాలను తగ్గించడానికి పసుపు కూడా సహాయపడుతుంది.

4. నీరు అధికంగా ఉండే ఆహారాలు

పీరియడ్స్ సమయంలో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దోసకాయలు, పుచ్చకాయలు మొదలైన ఆహార పదార్థాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

5. పెరుగు

పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉండే ఆహారం. పిరియడ్స్ సమయంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా అంతర భాగాలను కాపాడుతుందని, శరీరానికి పోషణనిస్తుందని నిరూపించబడింది.

Updated Date - 2022-11-30T15:25:47+05:30 IST