Menstrual hygiene: శానిటరీ ప్యాడ్స్‌.. క్యాన్సర్, సంతానలేమికి కారణమవుతాయా?

ABN , First Publish Date - 2022-11-22T11:56:31+05:30 IST

శానిటరీ ప్యాడ్‌లో ఉండే కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యం మీద తీవ్రంగా హాని కలిగిస్తాయి.

Menstrual hygiene: శానిటరీ ప్యాడ్స్‌.. క్యాన్సర్, సంతానలేమికి కారణమవుతాయా?
sanitary pads,

ఒకప్పుడు పిరియడ్స్ మొదలయ్యాయంటే ప్రతి మహిళ ఇంట్లో ఉండే పాత దుస్తులనే ఉపయోగించుకునేది. వీటితో శుభ్రత తక్కువగా ఉండటం, వాడే విధానంలో సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో రోగాలకు గురయ్యేది. దీనికి వెసులుబాటుగా వచ్చిన శానిటరీ ప్యాడ్స్ వల్ల చాలావరకూ ఉపశమనం కలిగినా.., శానిటరీ ప్యాడ్స్ వల్ల అనేక రుగ్మతలు కూడా తప్పవంటున్నాయి అధ్యయనాలు. అసలు శానిటరీ ప్యాడ్స్ వాడకం ఎందుకు ప్రమాదంగా మారనుంది. వివిరాల్లోకి వెళితే..

శానిటరీ ప్యాడ్‌లు పర్యావరణానికి శాపంగా ఉన్నాయని తరచుగా విమర్శించబడుతున్నప్పటికీ, అవి తీవ్రమైన ఆరోగ్యపరమైన చిక్కులను కూడా కలిగిస్తాయనేది అధ్యయనాల్లో తేలింది. నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO) నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, శానిటరీ ప్యాడ్‌లో ఉండే కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యం మీద తీవ్రంగా హాని కలిగిస్తాయని, వీటిని వాడటం వల్ల మహిళల్లో క్యాన్సర్, సంతానలేమికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది.

సాధారణంగా విక్రయించబడే శానిటరీ ప్యాడ్‌లలో క్యాన్సర్ కారకాలు, పునరుత్పత్తి టాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్, అలర్జీలు వంటి విష రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం. భారతదేశం అంతటా దొరికే పది శానిటరీ ప్యాడ్ బ్రాండ్‌లపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అన్ని నమూనాలలో కూడా థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (VOCలు) కనుగొనబడ్డాయి.

అధ్యయనం ప్రకారం,

ఈ రెండు రసాయనాలు క్యాన్సర్‌కు కారణమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఋతుస్రావం సమయంలో శానిటరీ ప్యాడ్ స్త్రీ యోనితో సంబంధం కలిగి దగ్గరగా ఉంటుంది కాబట్టి, స్త్రీ శరీరం ఈ రసాయనాలను పీల్చుకునే వీలుంటుంది. ఈ సమయంలో శ్లేష్మ పొరగా, యోని చర్మం కంటే ఎక్కువ స్థాయిలో రసాయనాలను స్రవిస్తుంది అలాగే గ్రహించగలదు కూడా.

దీనితోనే ప్రమాదం స్థాయి ఎక్కువగా ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. భారతదేశంలో దాదాపు నలుగురిలో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లపై ఆధారపడతారు. భారతదేశంలో 15 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉండే స్త్రీలలో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది.

అనేక పర్యావరణ సంస్థలు శానిటరీ ప్యాడ్‌ల వినియోగాన్ని వదిలివేయాలని ప్రజలను కోరుతున్నాయి, ఎందుకంటే వాటిలో రసాయనాలు, నాన్-బయోడిగ్రేడబుల్ పదార్థాలు ఉంటాయి, పర్యావరణానికి హాని కలిగించడానికి చాలా అవకాశం ఉందని తెలిపాయి. ఈ ప్రమాదాలను దాటాలంటే మళ్ళీ పాత కాలానికి పోయి దుస్తులనే వాడుకునే విధంగా ఉంది పరిస్థితి.

Updated Date - 2023-03-20T11:02:29+05:30 IST