Buttermilk health benefits: రోజూ మజ్జిగను తాగుతున్నారా..?

ABN , First Publish Date - 2022-11-23T11:07:45+05:30 IST

అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఒక గ్లాసు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Buttermilk health benefits: రోజూ మజ్జిగను తాగుతున్నారా..?
health benefits

మజ్జిగ మన భారతదేశంలో అందరూ ఇష్టంగా తాగే ప్రియమైన పానీయం. ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మజ్జిగ రుచికరమైన, తేలికైనదేకాక లాక్టోస్ అసహనంతో బాధపడుతున్నా, బరువు తగ్గడం గురించి ఆందోళన చెందుతున్నా, అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఒక గ్లాసు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

మజ్జిగతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. ఎసిడిటీని తగ్గిస్తుంది.

మజ్జిగ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ఇది పెరుగుతో తయారు చేస్తారు కాబట్టి ఆమ్లతను తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత, ఒక గ్లాసు మజ్జిగ ఎసిడిటీని తగ్గిస్తుంది. ఎండిన అల్లం, మిరియాలు వంటివి కలిపి తీసుకుంటే అవి మజ్జిగ లక్షణాలను మరింత పెంచుతాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ చిరాకును తగ్గిస్తుంది.

2. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

మలబద్ధకం, సంబంధిత సమస్యలను నివారించడానికి మజ్జిగ సహజమైన చికిత్స. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, మజ్జిగ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.

3. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, ముఖ్యంగా వేడి సమయంలో ఇది సరైన పానీయం. అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా, మజ్జిగ శరీరం నీటిని కోల్పోకుండా ఆపుతుంది. ఇది సహజంగా శరీరాన్ని తేమ చేస్తుంది. ప్రిక్లీ హీట్ వంటి వేసవి వ్యాధుల నుండి కాపాడుతుంది.

4. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది

కాల్షియం మజ్జిగలో పుష్కలంగా ఉంటుంది. చాలా మంది పాలు, దానితో తయారయ్యే ఇతర పాల ఉత్పత్తులను తినలేరు. అలాంటి వారు లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా మజ్జిగను ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా తీసుకోవచ్చు. మజ్జిగలో కొవ్వు ఉండదు కనుక డైటింగ్, బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి కాల్షియం సమస్య ఉండదు.

5. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

నిరంతరం మజ్జిగ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-11-23T11:19:14+05:30 IST