Almonds improve your bacterial metabolism: బాదంతో బాప్ రే ఎన్ని బెనిఫిట్స్..!

ABN , First Publish Date - 2022-11-24T12:29:53+05:30 IST

జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థలతో సహా మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది

Almonds improve your bacterial metabolism: బాదంతో బాప్ రే ఎన్ని బెనిఫిట్స్..!
Almonds

ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులు తీసుకుంటే అవి మన బ్యూటిని పెంచుతాయి, బాదంలో ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పరిశోధకుల బృందం బాదం ప్రయోజనాలను, దాని ప్రభావాన్ని పరిశోధించింది. ఈ అధ్యయనంలో, మన జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థలతో సహా మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది.

రోజుకు 6 బాదంపప్పులు తినేవారిలో బ్యూటిరేట్ గణనీయంగా ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. బాదంపప్పు తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అద్భుత పోషకాలోతో పాటు కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.

బరువు తగ్గించుకోవాలనుకునేవారు క్రమం తప్పకుండా రోజూ బాదం తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా బరువు తగ్గుతారు. బాదాన్ని రోజూ రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ పరీక్షలో తేలింది.

almonds-1.jpgబాదం తింటే మనకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం తక్కువ కనుక రక్తపోటు (Blood Pressure) సమస్య అసలే ఉండదు. రక్తప్రసరణ సరిగా జరిగే గుండె సంబంధిత సగం జబ్బులకు పరిష్కారం దొరికినట్లే. బాదం తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి నాలుగైదు రోజులు బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Updated Date - 2022-11-24T13:22:01+05:30 IST