Munugode Election Results: ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-11-06T16:29:50+05:30 IST

మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Munugode Election Results: ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
Komati Reddy Rajagopal Reddy

మునుగోడు: మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిని అంగీకరించారు. మునుగోడులో అధర్మం గెలిచిందని ఆక్రోషం వెళ్లగక్కారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అదికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించారు. నైతిక విజయం తనదేనని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2022-11-06T16:33:24+05:30 IST