Harbhajan Singh: ఢిల్లీ ఎంసీడీ పోల్స్.. స్టార్ క్యాంపెయినర్‌గా హర్భజన్‌సింగ్
ABN , First Publish Date - 2022-11-11T20:44:12+05:30 IST
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించింది. వీరిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఓ మత మార్పడి కార్యక్రమంలో పాల్గొని విమర్శలు ఎదుర్కొని ఆపై మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర పాల్ గౌతమ్‌కు కూడా ఈ జాబితాలో చోటు లభించింది.
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఢిల్లీ, పంజాబ్ కేబినెట్ మంత్రులు కైలాశ్ గెహ్లోట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సైన్, రాజ్ కుమార్ ఆనంద్ తదితరులు ఉన్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో స్టార్ క్యాంపెయినర్లదే కీలక పాత్ర. అందుకే రాజకీయ పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపుతుంటాయి. నిబంధనల ప్రకారం స్టార్ క్యాంపెయినర్లు 40 మందికి మించకూడదు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 250 వార్డులకు డిసెంబరు 4న జరగనున్నాయి. 7న ఫలితాలు వెల్లడవుతాయి.
Read more