తాడేపల్లిగూడెంలో ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-10-23T15:36:29+05:30 IST

ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెంలో సినీ నటుడు ప్రభాస్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

తాడేపల్లిగూడెంలో ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం

ప.గో.జిల్లా: తాడేపల్లిగూడెంలో సినీ నటుడు ప్రభాస్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు అత్యుత్సాహంతో థియేటర్‌లో సీట్ల మీద బాణసంచా కాల్చారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సీట్లు కాలిపోయాయి. థియేటర్‌లో మంటలు, పొగలు వ్యాపించడంతో అభిమానులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక నిరోధకాలు కోసం వెతికినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు. చివరకు థియేటర్ యాజమాన్యం మంటలను అదుపు చేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు.

Updated Date - 2022-10-23T19:48:49+05:30 IST