YCP ప్రభుత్వ తీరుపై అధికార జడ్పీటీసీ సభ్యుల అసంతృప్తి
ABN , First Publish Date - 2022-12-31T15:22:21+05:30 IST
ఏలూరు (Eluru)లో జడ్పీ స్టాండింగ్ కమిటీ (ZP standing Committee) సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాసరావు సమక్షంలోనే
ఏలూరు: ఏలూరు (Eluru)లో జడ్పీ స్టాండింగ్ కమిటీ (ZP standing Committee) సమావేశంలో ప్రభుత్వ తీరుపై జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాసరావు సమక్షంలోనే అధికార పార్టీ జడ్పీటీసీలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం (ycp government) పెన్షన్లు తొలగించిన విధానంపై అధికార పార్టీ జడ్పీటీసీ పెద్దిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎన్ని పెన్షన్లు(Pensions) తీస్తున్నారో.. ఎన్ని ఇస్తున్నారో కూడా తమకు సమాచారం లేదని వాపోయారు. పింఛన్ల కోసం వస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు ఆవేదన చెందారు. ప్రభుత్వ విధివిధానాలు తమకు తెలియటం లేదని.. కనీసం సచివాలయ (Secretariat) సిబ్బంది కూడా గౌరవం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో సచివాలయ సిబ్బందికి ఉన్న విలువ తమకు లేదన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతిపక్ష నేతలు తమపై దుమ్మెత్తి పోస్తున్నారని పోడూరు జడ్పీటీసీ పెద్దిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.