ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్ఛ

ABN , First Publish Date - 2022-11-21T02:39:33+05:30 IST

ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు అదుపు తప్పింది. విజయనగరం జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.

ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్ఛ

బస్సు ఢీకొని బాలుడు మృతి.. వృద్ధురాలికి గాయాలు

శృంగవరపుకోట రూరల్‌, నవంబరు 20: ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు అదుపు తప్పింది. విజయనగరం జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌.కోట డిపోకు చెందిన బస్సు ఆదివారం ఉదయం ధర్మవరం మీదుగా విజయనగరం వెళ్తోంది. మారుతీనగర్‌ వద్ద డ్రైవర్‌ గంగునాయుడుకి మూర్ఛ (ఫిట్స్‌) వచ్చి డ్రైవింగ్‌పై పట్టుకోల్పోయారు. ఎదురుగా వస్తున్న శిరికి అభిషేక్‌ (13)ను బస్సు ఢీకొట్టింది. అలాగే ముందుకు వెళ్లి ఓ ఇంటి ప్రహరీ గోడను ఢీకొన్నాక ఆగింది. ఇంటి ఆవరణలో పనిచేసుకుంటున్న వృద్ధురాలు తోత్తడి పాప గాయపడింది. అభిషేక్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. గంగునాయుడు, వృద్ధురాలు పాపలను కూడా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-11-21T02:39:33+05:30 IST

Read more