Varla Ramaiah: ఎలక్ట్రానిక్ మీడియా గురించి అలీకి ఏం తెలుసు?

ABN , First Publish Date - 2022-10-28T20:51:31+05:30 IST

సినీనటుడు అలీ (Ali)ని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించడంపై టీడీపీ నేత వర్లరామయ్య (Varla Ramaiah) స్పందించారు.

Varla Ramaiah: ఎలక్ట్రానిక్ మీడియా గురించి అలీకి ఏం తెలుసు?
Varla Ramaiah, Tdp Leader

విజయవాడ: సినీనటుడు అలీ (Ali)ని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించడంపై టీడీపీ నేత వర్లరామయ్య (Varla Ramaiah) స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియా గురించి అలీకి ఏం తెలుసు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. అలీ ఈ నియామకాన్ని వ్యతిరేకించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ముస్లిం సమాజాన్ని ఓ విధంగా జగన్ (Jagan) అవమానించినట్లే అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-28T20:53:10+05:30 IST