Minister Roja: పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటిషన్

ABN , First Publish Date - 2022-12-13T21:36:52+05:30 IST

Amaravathi: జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’ గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వాహనంపై కొందరు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. మంత్రి రోజా అది వారాహి కాదు నారాహి అని

Minister Roja: పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటిషన్

Amaravathi: జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’ గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వాహనంపై కొందరు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. మంత్రి రోజా అది వారాహి కాదు నారాహి అని వ్యాఖ్యానించారు. నారాహి ముసుగులో వారాహి వాహనంలో వచ్చినా ఎవరూ భయపడరని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అని, జనసేన అట్టర్ ప్లాప్ అయిన సినిమా అని అన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఆల్ టైం రికార్డ్ అని చెప్పుకునే చంద్రబాబు (Nara Chandra Babu Naidu) రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రధానితో సహా మిగతా రాష్ట్రాల సీఎంలు అమలు చేస్తున్నారని తెలిపారు. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరపై ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు, కళలపై ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తామన్నారు.

Updated Date - 2022-12-13T21:36:53+05:30 IST